Russian Bat Virus Khosta-2: ఖోస్టా-2.. గబ్బిలాల నుంచి మానవాళికి మరో ‘మహమ్మారి’ ముప్పు!

Russian Bat Virus Khosta-2 Next Threat For Humans Says Scientists - Sakshi

కరోనాకి ముందు.. కరోనా తర్వాత అన్నచందాన తయారు అయ్యింది మనిషి పరిస్థితి. కొత్త కొత్త వైరస్‌లు, వ్యాధుల పేర్లు వినాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు గబ్బిలాల నుంచే మానవాళికి  మరో ముప్పు పొంచి ఉందని అమెరికన్‌ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఖోస్టా-2.. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న వైరస్‌ పేరు. ఇది రష్యా గబ్బిలాలో 2020లోనే గుర్తించామని, అది ఆ సమయంలో అది మనుషులకు అంతగా ప్రమాదం కలిగిస్తుందని అనుకోలేదని సైంటిస్టులు చెప్తున్నారు. సుదీర్ఘ పరిశోధనల అనంతరం.. ఇప్పుడు ఇది మనిషి కణజాలంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని, వైరస్‌ గనుక మనుషులకు వ్యాపిస్తే.. విజృంభణ, ముప్పు రెండూ తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.  ఈ వైరస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జర్నల్‌ పీఎల్‌ఓఎస్‌లో పబ్లిష్‌ చేశారు. 

కరోనా కంటే డేంజర్‌!
Khosta-2.. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌ అని అమెరికా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మనిషి కణాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకించడంతో పాటు ప్రస్తుత వ్యాక్సిన్‌లకు ఈ వైరస్‌ నిరోధకతను కలిగి ఉంటుందని సైంటిస్టులు నిర్దారించారు. అంటే.. కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం కోసం వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో యాంటీబాడీస్‌పైనా తీవ్ర ప్రభావం కూడా చూపెడుతుందని వెల్లడించారు. 

ఖోస్టా-2 అంటే.. 
ఖోస్టా-2.. సార్స్‌-కోవ్‌-2కి చెందిన వైరస్‌. ఇది కూడా కరోనావైరస్‌లోనే ఉపవర్గానికి చెందిన వైరస్సే. టైమ్‌ మ్యాగజైన్‌ కథనం ప్రకారం.. ఖోస్టా-1 అనేది మనుషులకు సోకదు. కానీ, ఖోస్టా-2 మాత్రం మనుషుల్లో ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. 

ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నుంచి కోలుకున్న వాళ్లు, వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు దీని బారి నుంచి తప్పించుకోలేరు. Omicron వేరియంట్ లాగా.. ఈ వైరస్‌లో తీవ్రమైన వ్యాధిని కలిగించే జన్యువులు లేవని పరిశోధకులు అంటున్నారు. కానీ SARS-CoV-2 జన్యువులతో కలిస్తే అది చివరికి మారే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం నిర్వహించిన మైకేల్‌ లెట్కో.  

గబ్బిలాలతో పాటు పాంగోలిన్స్‌, రకూన్‌ డాగ్స్‌, పామ్‌ సివెట్స్‌ జీవుల ద్వారా ఖోస్టా-2 వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈ వైరస్‌ విజృంభణపై, వ్యాక్సినేషన్‌ తయారీపై ఒక అంచనాకి రాలేమని ఆయన అంటున్నారు లెట్కో. దురదృష్టవశాత్తూ, ప్రస్తుత వ్యాక్సిన్‌లు మానవ కణజాలంపై ప్రభావం చూపెడుతున్న.. నిర్దిష్ట వైరస్‌ల కోసం రూపొందించబడుతున్నాయని, అన్ని సార్బెకోవైరస్‌ల నుంచి రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనే నమ్మకం సన్నగిల్లుతోందని అని ఆయన అంటున్నారు.

ఇదీ చదవండి: ఈ దోమలు.. మలేరియాను అడ్డుకుంటున్నాయోచ్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top