ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. మరోసారి క్షిపణులు వర్షం..

Russia Missile Attack On Ukraine For Two Hours - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌ భూభాగాల దురాక్రమణకు దిగిన రష్యా సేనలు బుధవారం రాత్రి క్రూయిజ్, ఇతర క్షిపణులతో విరుచుకుపడ్డాయి. రెండు గంటలపాటు ఏకధాటిగా పలు రకాల క్షిపణులు దూసుకొచ్చాయని, 36 మిస్సైళ్లలో 16 క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్‌ సైనిక చీఫ్‌ వలేరీ జలూజ్నీ చెప్పారు. రష్యా క్షిపణుల దాడిలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఏడుగురు గాయపడ్డారు.

అయితే, రష్యా వాయుసేన కొత్తగా భారీ బెలూన్లను వదులుతోందని వలేరీ చెప్పారు. బెలూన్లకు ఉన్న కార్నర్‌ రిఫ్లెక్టర్లు రాడార్‌ సిగ్నళ్లను వెనక్కి పంపుతాయి. దీంతో ఆకాశంలో శత్రుదేశ డ్రోన్, క్షిపణి వస్తుందని భావించి ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తుంది. దీంతో ఉక్రెయిన్‌ క్షిపణులు వృథా అవుతాయి. ‘ఇది రష్యా వేసిన మరో ఎత్తుగడ’ అని వలేరీ అన్నారు. కాగా, రష్యాతో పోరులో మునిగిపోయిన ఉక్రెయిన్‌కు సాయపడేందుకు నార్వే ముందుకొచ్చింది. ఐదు సంవత్సరాల్లో విడతలవారీగా మొత్తంగా 7.4 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని నార్వే ప్రకటించింది.
చదవండి: ట్రంప్‌కు ఊహించని షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో సవాల్..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top