పాక్‌ మళ్లీ మొదలుపెట్టేసింది.,.! | Pak Rebuilding Terror Launchpads Destroyed In Operation Sindoor | Sakshi
Sakshi News home page

పాక్‌ మళ్లీ మొదలుపెట్టేసింది.,.!

Jun 28 2025 9:54 PM | Updated on Jun 28 2025 9:55 PM

Pak Rebuilding Terror Launchpads Destroyed In Operation Sindoor

కరాచీ:  భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌ ఉనికిలో లేకుండా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ దెబ్బకు పాక్‌ అతాలకుతలమైంది.  భారత్‌ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్‌ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌ కాస్త దారికొచ్చింది. 

ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్‌ చేసిన దాడులకు పాకిస్తాన్‌ ఊపిరి తీసుకోలేకపోయింది.  అలాగే పాక్‌ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్‌ టార్గెట్‌ చేసి పైచేయి సాధించింది. మళ్లీ భారత్‌పై పాకిస్తాన్‌ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్‌ సింధూర్‌ ఆన్‌లోనే ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరికల నేపథ్యంలో వారు కాల్పుల విరమణకు వచ్చారు. 

ఈ తరహా దాడుల్ని ఊహించని పాక్‌.. ప్రస్తుతం మళ్లీ తిరిగి భారత్‌ నేలకూల్చిన నిర్మాణాలను పునః నిర్మించుకునే పనిలో పడింది.  పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలుగా భావిస్తున్న వాటిని తిరిగి నిర్మిస్తోంది. ఇటీవల పాక్‌కు విదేశీ ఫండింగ్‌ బాగానే అందడంతో దానిని ధ్వంసమైన ఉగ్రస్థావరాల కోసం కూడా ఖర్చు చేస్తోంది. 

దాంతో పాటు పాక్‌ ఆర్మీ క్యాంప్‌లకు సంబంధించి శాటిలైట్‌ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో దానిని కూడా పునరుద్దరించే పనిలో పడింది. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్ మరియు జంగ్లోరా వంటి ప్రాంతాలలో ఈ మేరక పాకిస్తాన్‌ పునర్నిర్మాణాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

మరొకవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ సహకారంతో, నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలోని దట్టమైన అడవులలో హైటెక్‌ టెక్నాలజీతో చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి యత్సిస్తున్నట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది.  అసలు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌..  ఉగ్రవాద శిబిరాల పునః నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను అప్పులు చేసి మరీ తిప్పలు తెచ్చకోవడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement