జీన్స్‌ను నెలకు ఒక్కసారే ఉతకాలంట.. కారణమేంటంటే

Overuse of Washing Machine is Harmful for Environment Say Experts - Sakshi

వాషింగ్‌ మెషీన్‌ వాడకం తగ్గించండి.. భూమిని కాపాడండి

వెల్లడించిన నివేదిక

న్యూఢిల్లీ: సైన్స్‌ అభివృద్ధి చెందుతున్న కొద్ది మనిషికి సౌకర్యాలు పెరిగాయి. ప్రతిదీ చేయి దగ్గరకు వస్తుంది.. ఇక మన శారీరక శ్రమను తగ్గించే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రైండర్లు, మిక్సీలు, వాషింగ్‌ మెషీన్‌లు. వీటి వల్ల మహిళలకు ముఖ్యంగా ఉద్యోగం చేసే ఆడవారికి పని సులువు అయ్యింది.. సమయం కూడా చాలా కలసి వస్తుంది. అయితే ఈ పరికరాల వల్ల మనిషికి లాభమే కానీ పర్యవరణానికి చాలా కీడు జరుగుతుంది. ముఖ్యంగా మన సౌకర్యం కోసం వాడుతున్న ఫ్రిజ్‌ల వల్ల ఓజోన్‌ పొరకు చాలా నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి మరోకటి వచ్చి చేరింది. అది వాషింగ్‌ మెషీన్‌. మనల్ని బట్టలుతికే శ్రమ నుంచి తప్పించని వాషింగ్‌ మెషీన్‌ను తరచుగా వాడటం వల్ల పర్యావరణం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది అటున్నారు నిపుణులు. భూమిని పరిరక్షించుకోవాలని భావిస్తే.. వాషింగ్‌ మెషిన్‌ వాడకాన్ని తగ్గించమని సూచిస్తున్నారు. ఆ వివరాలు..
(చదవండి: ఉన్నట్టుండి వాషింగ్‌ మిషిన్‌ ఢాం!! అని పేలింది..)

తాజాగా సోసైటీ ఆఫ్‌ కెమికల్‌ ఇండస్ట్రీ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సమాజంలో ఎక్కువ మంది చాలా తరచుగా.. అంటే ప్రతి రోజు వాషింగ్‌ మెషీన్‌ను వాడుతున్నారని.. దీనివల్ల పర్యావరణం మీద చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఈ నివేదక వెల్లడిస్తుంది. మీరు వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికే ప్రతిసారి, మిలియన్ల మైక్రోఫైబర్‌లు నీటిలోకి విడుదల అయ్యి మహాసముద్రాలలోకి ప్రవేశిస్తాయి. మైక్రోఫైబర్‌లు ప్లాస్టిక్ చిన్న తంతువులు. ఇవి పాలిస్టర్, రేయాన్, నైలాన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌ల నుంచి వెలువడతాయి. మహాసముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యానికి ఇవి ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

దీన్ని నివారించాలంటే.. నెలకు ఒక్కసారి మాత్రమే వాషింగ్‌ మెషీన్‌ వాడమని నిపుణులు ఈ నివేదికలో సూచించారు. అంటే జీన్స్‌ ప్యాంట్స్‌ని నెలకు ఒకసారి.. జంపర్స్‌ని పదిహేను రోజులకు ఒకసారి.. పైజామాలను వారానికొకసారి ఉతకాలని తెలిపారు. అలానే లోదుస్తులను ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలని.. అది మెషీన్‌లో కాకుండా సాధారణ పద్దతుల్లో ఉతుక్కోవాలని సూచించారు. టీ షర్ట్స్‌, టాప్స్‌ వంటి వాటిని ఐదు సార్లు.. డ్రెస్‌లను ఆరు సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచించారు నిపుణులు.

ఇలా చేయడం వల్ల టైమ్‌, మనీతో పాటు దుస్తులు కూడా ఎక్కువ కాలం మన్నుతాయని తెలుపుతున్నారు. బట్టలు తక్కువ సార్లు ఉతకడం వల్ల కరెంట్‌, నీటి వినియోగం తగ్గుతుంది. డిటర్జెంట్ల వాడకం తగ్గడం వల్ల తక్కువ సార్లు రసాయనాలు వాడినట్లు అవుతుంది. ఫలితంగా భూమికి మేలు చేసినవారం అవుతాం అంటున్నారు నిపుణులు. 


(చదవండి: వాషింగ్‌ మెషీన్‌లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్‌చల్‌)

"వాషింగ్ మెషీన్లను కనిపెట్టడానికి ముందు, బట్టలు ఉతకడం అనేది శ్రమతో కూడుకున్నది, అలసటగా ఉండేది. అయితే వాషింగ్‌ మెషీన్లు వచ్చాక ఈ శ్రమ తగ్గింది. ఉతకడం ఎక్కువయ్యింది. దీన్ని తగ్గిస్తే.. మనం మనతో పాటు మనం నివసించే గ్రహం కూడా బాగుంటుంది" అని ఫ్యాషన్ రివల్యూషన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు , ఓర్సోలా డి కాస్ట్రో తెలిపారు.

చదవండి: జీన్స్‌ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top