జీన్స్‌ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా?

Jeans Wearing Padmasana Is Harmful To People - Sakshi

రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతోపాటు సౌకర్యమూ ఉండటం వల్ల జీన్స్‌ ప్యాంట్స్‌ పట్ల యువతీయువకుల్లో మాత్రమే గాక ప్రజలందరిలోనూ వాటి పట్ల మక్కువ ఎక్కువ. అయితే జీన్స్‌ ప్యాంట్ల వల్ల కలిగే అనర్థాలపై జరిగిన అధ్యయనాల్లోని ఒక అంశం కాస్తంత ఆందోళన గొలిపేదిగా ఉంది. జీన్స్‌ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్‌ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జీన్స్‌ ప్యాంట్‌ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే  ఒక్కోసారి జీన్స్‌ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా వచ్చేందుకు అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్‌ వేసుకొని ‘స్క్వాటింగ్‌’ అస్సలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్‌ ఆఫ్‌ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్‌ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. 

చదవండి: స్త్రీల దుస్తులకూ వయసుంటుందా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top