ఉక్రెయిన్‌ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా

Not For Ukraine Only This Reason Bident Ready To Meet Putin - Sakshi

ఉక్రెయిన్‌ దురాక్రమణ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంచనా మొత్తంగా తప్పిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలో బైడెన్‌ మాట్లాడుతూ.. పుతిన్‌ ఓ హేతుబద్ధమైన నటుడని,  ఉక్రెయిన్‌ ఆక్రమణ అవకాశాల విషయంలో పుతిన్‌ తనను తాను తప్పుగా అంచనా వేసుకున్నాడు అని పేర్కొన్నారు.

ఇక.. నవంబర్‌లో ఇండోనేషియా బాలిలో జరగబోయే జీ20 దేశాల సదస్సు గురించి ప్రస్తావనకు రాగా.. ఉక్రెయిన్‌పై చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని బైడెన్‌ స్పష్టం చేశారు. అసలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసే ఉద్దేశమే తనకు లేదని పేర్కొన్నారాయన. అయితే.. 

అయితే రష్యాలో నిర్బంధంలో ఉన్న US బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రైనర్‌ను విడుదల అంశంపై మాత్రం పుతిన్‌తో సంప్రదింపులకు తాను ఆలోచిస్తానని, అది పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందని బైడెన్‌ తెలిపారు.

అమెరికా బాస్కెట్‌ బాల్‌ సంచలనం, ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన 31 ఏళ్ల  బ్రిట్నీ గ్రైనర్‌ Brittney Griner.. రష్యా ప్రీమియర్‌ లీగ్‌ కోసం ఈ ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లింది. అయితే లగేజీలో హషిష్‌ నూనె hashish oil దొరకడంతో రష్యా కస్టమ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్స్‌ ఆరోపణలకుగానూ ఆమెకు తొమ్మిదేళ్ల శిక్ష విధించారు. అయితే అమెరికా మాత్రం ఆమెది బలవంతపు నిర్భంధంగా వాదిస్తోంది.

ఇదీ చదవండి: యూరప్‌కు కరెంటు కట్‌.. కారణం ఏంటంటే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top