కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం | Nobel Prize in Literature goes to Canadian author Anne Carson | Sakshi
Sakshi News home page

కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

Oct 8 2026 5:01 PM | Updated on Oct 8 2026 5:06 PM

Nobel Prize in Literature goes to Canadian author Anne Carson

2026 Nobel Prize in Literature : 2026 సంవత్సరానికి గాను  సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని కెనడా దేశానికి చెందిన ప్రసిద్ధ రచయిత్రి యాన్ కార్సన్ (Anne Carson) గెలుచుకున్నారు. క్లాసికల్ సంప్రదాయంతో చమత్కారమైన సంభాషణలతో, సమకాలీన సాహిత్యానికి సరికొత్త రూపాలను సృష్టించిన ఆమె సాహసోపేత సృజనాత్మక రచనల శైలికి గాను ఈ పురస్కారం లభించినట్లు స్వీడన్ అకాడమీ గురువారం (అక్టోబర్ 8) ప్రకటించింది.

యాన్ కార్సన్  ప్రస్థానం
1950లో కెనడాలోని టొరంటోలో జన్మించారుయాన్ కార్సన్ . 1981లో క్లాసిక్స్ అంశంపై 'Odi et Amo Ergo Sum' పేరుతో తన డాక్టరల్ థీసిస్‌ను పూర్తి చేశారు. తన జీవితాంతం కవిత్వ రచనను, అనువాద పనులను మరియు విశ్వవిద్యాలయాల్లో బోధనను సమన్వయం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పదాల మూలాలను (Etymology) తన ప్రతి రచనకు ప్రారంభ బిందువుగా భావించే యాన్ కార్సన్, భాషపై ఉండే మక్కువను, కొత్త అర్థాలను ఆశించే కవి కోరికను తన రచనల్లో అద్భుతంగా మిళితం చేశారు

ప్రముఖ రచనలు
1990లలో ఆమె పలు విశేషమైన రచనలు ప్రచురించారు. 1995లో వచ్చిన 'గ్లాస్, ఐరనీ అండ్ గాడ్' లోని 'ది గ్లాస్ ఎస్సే' (The Glass Essay) ద్వారా దీర్ఘ కవిత సామర్థ్యాన్ని, సాహిత్య ప్రక్రియల సరిహద్దులు చెరిగిపోయేలా ఎలా చూపవచ్చో నిరూపించారు.

2001లో ప్రచురితమైన 'ది బ్యూటీ ఆఫ్ ది హజ్బెండ్: ఎ ఫిక్షనల్ ఎస్సే ఇన్ 29 ట్యాంగోస్' పుస్తకం ద్వారా ఒక దగాకోరు భర్తతో సాగిన కష్టతరమైన సంబంధాన్ని 29 భాగాలుగా కవితాత్మకంగా వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement