ఈ ఏటి మేటి మహిళలు వీరే! | Sakshi
Sakshi News home page

Most Famous Women:ఈ ఏటి మేటి మహిళలు వీరే!

Published Mon, Dec 18 2023 12:39 PM

Most Famous Women in News at Global Level - Sakshi

కొద్దిరోజుల్లో 2023 ముగియబోతోంది. డిసెంబరులో సగభాగం ఇప్పటికే గడిచిపోయింది. ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా  అత్యధికంగా చర్చలలోకి వచ్చిన మహిళలు కొందరు ఉన్నారు. 

అత్యధిక సంపాదనతో..
టేలర్ స్విఫ్ట్: ఈ సంవత్సరం వార్తల్లో ప్రముఖంగా కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో టేలర్ స్విఫ్ట్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అక్టోబర్‌లో టేలర్ స్విఫ్ట్ బిలియనీర్‌గా మారారు. టేలర్ స్విఫ్ట్  పేరొందిన సింగర్‌. ఆమె తన పాటలు, నటన ద్వారా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన మొదటి మహిళగా నిలిచారు. టేలర్ స్విఫ్ట్ తన పాటలు, రాయల్టీల ద్వారా 500 మిలియన్ డాలర్లు (ఒక మిలియన్‌ అంటే రూ. 10 లక్షలు) సంపాదించారు. 

ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా..
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ఏడాది వార్తల్లో కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో మెలోని నాల్గవ స్థానంలో నిలిచారు. 2022, అక్టోబరు 22న మెలోని ఇటలీ పగ్గాలు చేపట్టారు. మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధానమంత్రి. మెలోని 2014 నుండి ఇటలీ రైట్ వింగ్ పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. 

ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానం..
కమలా హారిస్ కూడా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. కమలా హారిస్ అమెరికాకు చెందిన మొదటి నల్లజాతి మొదటి మహిళ. అలాగే ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి దక్షిణాసియా అమెరికన్. 2021, జనవరి 20న కమలా హారిస్ యూఎస్‌ఏ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో కమలా హారిస్ మూడో స్థానంలో నిలిచారు.యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలిగా..
క్రిస్టీన్ లగార్డ్.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు. ఈ ఉన్నత పదవిని చేపట్టిన మొదటి మహిళ క్రిస్టీన్ లగార్డ్. ఆమె  తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. యూరో జోన్ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గించేందుకు ఆమె ప్రయత్నించారు. 

అత్యంత శక్తివంతమైన మహిళగా..
ఫోర్బ్స్ జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్లేయెన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఉర్సులా వాన్ డెర్లేయెన్‌ 2019, జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ. ఉర్సులా వాన్ డెర్లేయన్ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరొందారు. 
ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ  అగ్ని ప్రమాదాలివే..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement