గెలాక్సీలు ఢీకొంటే! | Milky Way galaxy is on a collision course with the Andromeda galaxy | Sakshi
Sakshi News home page

గెలాక్సీలు ఢీకొంటే!

May 31 2025 5:02 AM | Updated on May 31 2025 6:11 AM

Milky Way galaxy is on a collision course with the Andromeda galaxy

గెలాక్సీలు. అసంఖ్యాకమైన నక్షత్రాలకు నిలయాలు. అలాంటి రెండు అతి పెద్ద గెలాక్సీలు పరస్పరం ఢీకొంటే? అందులో ఒకటి మన పాలపుంతే అయితే? సుదూర భవిష్యత్తులో జరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. పాలపుంతకు అత్యంత సమీపంలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. అవి రెండూ ప్రస్తుతం పరస్పరం 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి.

 అవి పరస్పరం సమీపించే కొద్దీ జరగబోయే భావి పరిణామాలకు సంబంధించిన ఊహాచిత్రాలను నాసా తాజాగా విడుదల చేసింది. మొదటి ఫొటోలో అవి 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. రెండో ఫొటోలో చూపినట్టుగా ఆ దూరం 5 లక్షల కాంతి సంవత్సరాలకు తగ్గుతూనే రెండు గెలాక్సీల్లోనూ ఉండే కృష్ణరాశి కారణంగా వాటి మధ్య విపరీతమైన రాపిడి పుడుతుంది. 

దాంతో అవి పరస్పరం దగ్గరయ్యే వేగం ఊహాతీతంగా పెరుగుతుంది. అది లక్ష కాంతి సంవత్సరాలకు తగ్గిన మరుక్షణం మూడో ఫొటోలో మాదిరిగా అవి ఢీకొంటాయి. అలాగని మనం పెద్దగా భయపడాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే మన పాలపుంత, ఆండ్రోమెడా ఢీకొనేందుకు కనీసం మరో 400 నుంచి 500 కోట్ల ఏళ్లు పడుతుందట! అంతేగాక దీని ప్రభావం మన సౌరవ్యవస్థపై మాత్రం మరీ భారీగా ఉండకపోవచ్చన్నది సైంటిస్టుల అంచనా.
 

Advertisement
 
Advertisement
Advertisement