‘కిమ్‌ తన అంకుల్‌ని ఎలా చంపాడో నాకు చెప్పాడు’

Kim Jong Un Told Donald Trump About Killing His Uncle In Rage Book - Sakshi

అమెరికా తయారు చేసిన కొత్త రహస్య ఆయుధం గురించి వెల్లడి

సంచలనంగా మారిన ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్ట్‌ బాబ్‌ వుడ్‌ పుస్తకం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బాబ్ వుడ్‌వార్డ్ పుస్తకం ‘రేజ్‌’ ఓ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ పుస్తకంలోంచి లీకైన కొన్ని కథనాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా కరోనా గురించి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌, ట్రంప్‌ మధ్య జరిగిన సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఆసక్తికరంగా మారాయి. వీటితో పాటు కిమ్‌ గురించి ట్రంప్‌ ఆలోచనలు, వర్ణ వివక్షతో సహా, ట్రంప్‌ పేర్కొన్న రహాస్యమైన కొత్త ఆయుధానికి సంబంధించిన అంశాలు ఈ పుస్తకంలో ఉండనున్నట్లు సమాచారం. డిసెంబర్‌, జనవరి మధ్య ట్రంప్‌, వుడ్‌వార్డ్‌తో పాటు మరికొందరికి ఇచ్చిన 18 ఇంటర్వ్యూలలో వివిధ అంశాల గురించి వెల్లడించిన వివరాలను ఈ పుస్తకంలో ప్రచురించారు. (చదవండి: నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ నామినేట్‌)

ఈ క్రమంలో ట్రంప్‌ మొదటి సారి కిమ్‌ని చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యాడని.. తాను ఊహించినదానికంటే కిమ్‌ చాలా స్మార్ట్‌ అని ట్రంప్‌ అభిప్రాయపడ్డట్లు సమాచారం. అంతేకాక కిమ్‌ తనతో అన్ని విషయాలు చెప్పాడని.. ముఖ్యంగా తన్‌ అంకుల్‌ని చంపడం గురించి కూడా కిమ్‌ తనతో చెప్పాడని ట్రంప్‌ పేర్కన్నట్లు ఈ పుస్తకం వెల్లడిస్తోంది. ఇరు దేశాధ్యక్షుల మధ్య నడిచిన ఉత్తరాల గురించి కూడా ఈ పుస్తకం తెలుపుతోంది. ఒక లేటర్‌లో కిమ్, ట్రంప్‌ని ఉద్దేశించి.. ‘యువర్‌ ఎక్సలెన్సీ’ అని సంభోదించినట్లు వెల్లడిస్తోంది. అంతేకాక ఉత్తర కొరియా అణ్వాయుధాలను సొంత ఇంటి వలే ప్రేమిస్తుందని.. ఇతర దేశాలకు అమ్మదని ట్రంప్‌ అభిప్రాయపడినట్లు ఈ పుస్తకంలో ఉంది. ఇరు దేశాధ్యక్షుల మధ్య ఉ‍న్న లోతైన స్నేహం ఓ మ్యాజికల్‌ పవర్‌లా పని చేస్తుందని కిమ్‌, ట్రంప్‌కి రాసిన లేఖలో పేర్కన్నట్లు పుస్తకం తెలుపుతోంది. ఈ ఉత్తరాలను వైట్‌ హౌస్‌ మాస్టర్‌ పీస్‌లుగా పరిగణిస్తుందని సమాచారం. (చదవండి: కిమ్ అరాచ‌కం: వారి పాలిట శాపం)

అంతేకాక ట్రంప్‌ అమెరికా తయారు చేసిన కొత్త రహస్య ఆయుధం గురించి కూడా వెల్లడించారని వుడ్‌వార్డ్‌ పేర్కన్నారు. అమెరికా సైన్యం రూపొందించిన ఈ రహస్య ఆయుధం గురించి రష్యా, చైనాతో సహా ఏ దేశానికి కూడా తెలియదని ట్రంప్‌ పేర్కన్నాడని తెలిపింది. ఒక తెల్లజాతీయుడిగా.. బ్లాక్‌ అమెరికన్స్‌ బాధని ట్రంప్‌ ఎలా అర్థం చేసుకుంటారని వుడ్‌వర్డ్‌ ప్రశ్నించగడా.. అసలు తనకు ఆ అవసమరే లేదని ట్రంప్‌ పేర్కొన్నట్లు పుస్తకం తెలుపుతోంది. వచ్చే వారం విడుదల కానున్న ఈ పుస్తకం ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top