కోర్టు హాల్‌లో మహిళా జడ్జిపై దాడి | Judge attacked in Las Vegas court room | Sakshi
Sakshi News home page

కోర్టు హాల్‌లో మహిళా జడ్జిపై దాడి

Jan 5 2024 2:01 AM | Updated on Jan 5 2024 2:02 AM

Judge attacked in Las Vegas court room - Sakshi

మహిళా జడ్జిపై దాడి చేస్తున్న నిందితుడు. గాయపడిన జడ్జి    

నెవడా: ఓ కేసు విచారణకు సందర్భంగా నిందితుడు అనూహ్యంగా మహిళా జడ్జిపైకి దాడికి పాల్పడ్డాడు. అనంతరం కోర్టు సిబ్బంది, ఇతరులు కలిసి పిడిగుద్దులతో అతడికి దేహశుద్ధి చేశారు. లాస్‌ వెగాస్‌లోని రీజినల్‌ జస్టిస్‌ సెంటర్‌లో బుధవారం ఉదయం ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం బేస్‌బాల్‌ బ్యాట్‌తో ఓ వ్యక్తిపై దాడి చేశాడన్న ఆరోపణ లెదుర్కొంటున్న డియోబ్రా డెలోన్‌ రెడెన్‌(30)అనే వ్యక్తిని పోలీసులు క్లార్క్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ జడ్జి మేరీ కే హొల్థుస్‌ ఎదుట ప్రవేశపెట్టారు.

కేసు వాదనలు పూర్తి కాగా, జడ్జి తీర్పు ప్రకటించారు. తీర్పువిన్న రెడెన్‌ తీవ్ర ఆగ్రహంతో దుర్భాష లాడుతూ ఒక్కసారిగా దుమికి, జడ్జి టేబుల్‌పైకి చేరుకున్నాడు. జడ్జి హొల్థుస్‌ వెనక్కి నెట్టేశాడు. దీంతో, ఆమె కుర్చీలో నుంచి వెనక్కి పడిపోయి, గోడకు గుద్దుకున్నారు. అడ్డుకోబోయిన కోర్టు మార్షల్‌కు గాయాలయ్యాయి. కోర్టు సిబ్బంది, ఇతరులు కలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు హాలు కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. కోర్టు హాలుకు వచ్చిన సమయంలో అతడి చేతులకు బేడీలు లేవు. ఘటన జడ్జి ఆదేశాల మేరకు రెడెన్‌ చేతులకు బేడీలు వేసి, క్లార్క్‌ కౌంటీ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement