‘డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక మోసగాడు, ఫెయిల్యూర్‌’ Joe Biden campaign trolls on trump he is a crook and failure. Sakshi
Sakshi News home page

‘డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక మోసగాడు, ఫెయిల్యూర్‌’

Published Sat, Jun 15 2024 10:48 AM | Last Updated on Sat, Jun 15 2024 12:45 PM

Joe Biden campaign trolls on trump he is a crook and failure

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్‌ పార్టీ ప్రెసిడెంట్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గత కొంత కాలం నుంచి  అధిక వయసు పేరుతో జో బైడెన్‌(81)పై విమర్శలు గుప్పిస్తున్నారు. నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇదే విషయాన్ని ట్రంప్‌ ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. బైడెన్‌తో పోల్చితే అమెరికాకు తానే చురుకైన ప్రెసెడింట్‌గా ఉండగలనని పేర్కొంటున్నారు. అయితే శుక్రవారం ట్రంప్‌ సైతం 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. దీంతో జో బైడెన్‌ ఎన్నికల ప్రచారం బృందం ఓ వైపు ట్రంప్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియజేస్తునే తీవ్రంగా  విమర్శలు చేస్తూ ఓ సందేశం పంపారు.

‘హ్యాపీ బర్త్‌ డే ట్రంప్‌. మీరు మోసపూరిత, ఫెయిల్యూర్‌ వ్యక్తి. అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, హాక్కులు, భవిష్యత్తుకు మీరు చాలా ప్రమాదకారి. మీరు ఇక ఎప్పటికీ అమెరికాకు ప్రెసిడెంట్‌ కాలేరు. మీ 79వ బర్త్‌డేకు అదే మొదటి అందమైన బహుమతి అవుతుంది’అని తెలిపింది.  అదేవిధంగా అధ్యక్షుడు బైడెన్‌ అధికార యంత్రాగం సైతం ట్రంప్‌పై విమర్శలు చేస్తూ.. ట్రంప్‌ సాధించిన 78 విజయాలు ఇవే అంటూ ఆయనపై ఉన్న కేసులు, అభియోగాల జాబితాను విడుదల చేసింది. పలు కేసులు, అభియోగాలు మోపబడిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ట్రంప్‌ అని ఎద్దేవా చేసింది.

అంతకుముందు ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ ట్రంప్‌కు ఎక్స్‌లో  బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ‘అధిక వయసు ఉ‍న్న వ్యక్తి నుంచి మరో  ఎక్కువ వయసు ఉ‍న్న వ్యక్తిగా బర్త్‌ డే శుభాకాంక్షలు అందుకోండి. వయసు అనేది  ఒక సంఖ్య మాత్రమే. దానికి ఎన్నికలతో  సంబంధం లేదు. ఎన్నికలు అధ్యక్షుడి ఎంపిక చేసేవి మాత్రమే’’ అని బైడెన్‌ అన్నారు. ఇక.. ట్రంప్‌ అరోపించినట్లు గానే జో బైడెన్ అధిక వయసు​, మతిమరుపుతో ఇబ్బంది పడినట్లు పలు సందర్భాల్లో కనిపించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. ట్రంప్‌ 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇద్దరు అధిక వయసు నేతలు అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడటం అమెరికాలో తొలిసారి కావటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement