‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు? | Jews Also Have A Festival Like Diwali, Know Interesting Facts About What They Do In Hanukkah - Sakshi
Sakshi News home page

Jews Diwali Hanukkah: యూదుల దీపావళి.. ‘హనుక్కా’

Published Mon, Nov 6 2023 7:27 AM

Jews Also Have a Festival Like Diwali - Sakshi

భారతీయులు దీపావళి పండుగ కోసం ఏడాది పొడవునా ఆసక్తిగా వేచిచూస్తుంటారు.  ఆ రోజున భారతదేశం యావత్తూ దీపకాంతులతో నిండిపోతుంది. దీపావళి రోజున ఎక్కడ చూసినా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే మనం చేసుకునే దీపావళి లాంటి పండుగను యూదులు కూడా జరుపుకుంటారని మీకు తెలుసా? యూదులు ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారో.. దీపావళికి ఇది ఎలా సరిపోలి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న యూదులు జరపుకునే వెలుగుల పండుగ పేరు హనుక్కా. యూదులు దీనిని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ యూదులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఇజ్రాయెల్ అంతా కాంతులతో నిండిపోతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ పండుగ  ఇ‍జ్రాయిల్‌లో కేవలం ఒక్కరోజుతోనే ముగిసిపోదు. ఈ పండుగను యూదులు ఎనిమిది రోజులు ఆనందంగా జరుపుకుంటారు. హనుక్కా ఉత్సవ సమయంలో ప్రతి యూదు తమ ఇంటిలో 24 గంటలూ దీపాలు వెలిగిస్తాడు.

యూదుల ఈ పండుగను మన దీపావళి తర్వాత అంటే డిసెంబర్‌లో జరుపుకుంటారు. యూదుల ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 18 వరకూ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఇజ్రాయెల్ యూదులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఎంతో గుర్తింపు ఉంది. ఈ  ఉత్సవ సమయంలో ఎక్కడెక్కడి యూదులు సైతం వారి ఇళ్లకు చేరుకుని ఆనందంగా గడుపుతారు.

శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మనం దీపావళి జరుపుకున్నట్లే, యూదులు కూడా తమ విజయానికి గుర్తుగా హనుక్కా పండుగను జరుపుకుంటారు. నాటి రోజుల్లో క్రోబియన్ తిరుగుబాటు జరిగినప్పుడు గ్రీకు-సిరియన్ పాలకులకు వ్యతిరేకంగా యూదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ విధంగా వారిని జెరూసలేం నుండి వెళ్లగొట్టారు. దీనికి గుర్తుగా యూదులు హనుక్కా ఉత్సవాన్ని చేసుకుంటారు. 
ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే..

Advertisement
 
Advertisement