టోక్యో: జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో జనం ప్రాణభయంతో ఇళ్లు నుంచి బయటకు పరుగులుతీశారు. ప్రాణ, ఆస్టి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. టోక్యో నగరం సహా చుట్టుపక్కన ప్రాంతాల్లో భూమి కంపించింది.
దక్షిణ ఇబారకీ ప్రాంతంలో భూఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి సునామీ ప్రమాదం ఏమీలేదని అధికారులు స్పష్టంచేశారు. గత నెలలో 7.1 తీవ్రతతో వచి్చన భూకంపం ధాటికి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,500 భవనాలు నేలమట్టమయ్యాయి.


