‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం’: ఇజ్రాయెల్‌ ప్రేమ జంట ఫోటో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Israeli couple final pic ‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం ’ప్రేమ జంట ఫోటో వైరల్‌

Published Thu, Oct 12 2023 3:06 PM

Israeli couple takes final pic of their love as Hamas attacks music fest checkdetails - Sakshi

Israeli couple takes final pic’of their love ఇజ్రాయిల్‌లోని సూపర్‌ నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో 260 మంది ఊచకోత ఘటనలో ఇజ్రాయెల్ ప్రేమ జంట తీసుకున్న ఫైనల్‌ ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో అనూహ్యంగా ఒక ప్రేమ జంట ప్రాణాలతో బతికి బయటపడటం విశేషంగా నిలిచింది. ఇక చచ్చిపోతా మనుకుని,  చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్‌బర్డ్స్‌ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది.  సెప్టెంబర్ 29-అక్టోబర్ 6 జరిగిన ఈ ఫెస్ట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. ఉగ్రవాదుల నుండి రక్షించుకునే క్రమంలో వీరు పొదల్లో దాక్కొన్నారు. అయితే ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన అమిత్, నిర్  నేలపై పడుకుని, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే అదృష్టవశాత్తూ అమిత్‌, నిర్‌ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటంతో  కథ సుఖాంతమైంది. కానీ ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!)

జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ బుధవారం వారి ఫోటోను క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది, “ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌లో అమిత్ , నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్‌ పిక్‌ ఇది.  లక్కీగా వారు ప్రాణాలతో  బైటపడ్డారు. కానీ  ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది అంటూ  కమెంట్‌ చేసింది. దీనిపై నెటిజన్లు  కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ జంటకు అభినందలు తెలిపారు.  ఎంత అద్భుతం, ఈ చీకటిలో  వారి ప్రేమ సంతోషం ఎంత బాగా  మెరుస్తోంది. అని ఒకరు. ఇంత అందమైన ,ఆశాజనకమైన విషయాన్ని  ఈ మధ్య కాలంలో తాను చూడలేదని మరొకరు చెప్పారు. నా గుండె పగిలిపోయింది. మా ప్రజలపై జరుగుతున్న హింసను ప్రపంచమంతా చూస్తున్న క్రమంలో నిజంగా ఈ అందమైన బహుమతికి  ధన్యవాదాలు మరొకరు రాశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement