ఇజ్రాయెల్-హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ | Israel, Hezbollah agree to ceasefire in Lebanon, US official says | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్-హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ

Jun 19 2026 11:04 PM | Updated on Jun 19 2026 11:04 PM

Israel, Hezbollah agree to ceasefire in Lebanon, US official says

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఘర్షణలకు తాత్కాలిక ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌-హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరిందని అమెరికా అధికారులు వెల్లడించారు. లెబనాన్‌లో ఉద్రిక్తతలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

మధ్యవర్తిత్వంలో అమెరికా, ఖతార్‌ పాటు ఇరాన్ సహకారం కూడా ఉందని తెలుస్తోంది. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు సమాచారం.

కాగా, సీజ్‌ఫైర్‌కు ముందు దక్షిణ లెబనాన్‌లోని నబాతియే ప్రాంతంపై ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన భీకర దాడుల్లో 47 మంది మరణించినట్లు లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు హిజ్బోల్లా దాడుల్లో నలుగురు సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

ఇజ్రాయెల్-హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం​ ఇది మొదటిసారి కాదు. ఇటీవలే పలు మార్లు ఇరు పక్షాలు సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయి. అయినా పరస్సర దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందమైనా ఆచరణలోకి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement