ఖమేనీ అంత్యక్రియలు ఫిక్స్‌..? కదిలిరానున్న ఇరాన్‌ | Iran Sets Date for Khamenei's Funeral | Sakshi
Sakshi News home page

ఖమేనీ అంత్యక్రియలు ఫిక్స్‌..? కదిలిరానున్న ఇరాన్‌

Jun 3 2026 4:38 AM | Updated on Jun 3 2026 4:49 AM

Iran Sets Date for Khamenei's Funeral

టెహ్రాన్‌: ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్  ఆయుతుల్లా ఖమేనీ మరణించి దాదాపు మూడు నెలలు గడుస్తోంది.  యుద్ధం ప్రారంభమైన రోజే ఆయన మరణించినప్పటికీ పలు భద్రతా కారణాలతో ఆయన అంత్యక్రియలను ఇరాన్ వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇరాన్‌ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియల వివరాలను బహిర్గతం చేసింది.  

ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను మూడు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో భారీ ఊరేగింపులు  జరుపుతామంది.

ఇరాన్‌ ప్రకటనలో.. "ఊరేగింపులు  రాజధాని టెహ్రాన్‌తో పాటు, అక్కడి పవిత్ర నగరాలైన కోమ్, మషాద్ లలో జరుగుతాయి. అదేవిధంగా  దేశవ్యాప్తంగా  పలు ప్రాంతాల్లో సంతాప సభలు జరుగుతాయి. ఇక చివరగా ఖమేనీ పార్థివ దేహాన్ని మషాద్ నగరంలో ఖననం చేస్తాం" అని తెలిపింది.

అయితే ఈ అంత్యక్రియల తేదీలను మాత్రం ఇరాన్‌ స్పష్టంగా ప్రకటించలేదు. జూన్ మధ్యలో (ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెల ప్రారంభంలో) ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఖచ్చితమైన తేదీలను మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అయితే టెహ్రాన్ నగరంలోనే ఈ వీడ్కోలు కార్యక్రమం దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా సాగనున్నట్లు. తెలుస్తోంది. అంత్యక్రియల ఉత్సవాలకు సుమారు 2 కోట్ల (20 మిలియన్ల) మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement