ఇరాన్‌ సంచలన ప్రకటన.. 'హర్ముజ్‌ క్లోజ్' | Iran announces closure of the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సంచలన ప్రకటన.. 'హర్ముజ్‌ క్లోజ్'

Jun 20 2026 7:28 PM | Updated on Jun 20 2026 7:48 PM

Iran announces closure of the Strait of Hormuz

టెహ్రాన్‌: ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది. హర్ముజ్‌ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా శాంతి ఒప్పందం నియమాలను ఉల్లంఘించిందని అందుకే హర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తిరిగి హర్ముజ్‌ను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హర్ముజ్ మూసివేత తమ ప్రతిస్పందనలో కేవలం ఒక అడుగు మాత్రమేనని టెహ్రాన్‌ స్పష్టం చేసింది. 

కాగా ఇటీవలే 2026, జూన్ 17న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్‌లోని వర్సల్స్ ప్యాలెస్‌లో, అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ టెహ్రాన్‌లో ఈ మైత్రి ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో గత నాలుగు నెలలుగా  ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడం, నిలిచిపోయిన హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తిరిగి తెరవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

ఒప్పంద నిబంధనలు ఈ 14 సూత్రాల ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగించారు. ఈ సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షల ఎత్తివేతపై తుది చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే, ఈ ఒప్పందం జరిగిన మూడు రోజులకే ఈ రోజు (జూన్20న), ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇరాన్ హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement