మయన్మార్‌లో జనహననం | International Court of Justice finds Myanmar guilty of genocide against Rohingya | Sakshi
Sakshi News home page

మయన్మార్‌లో జనహననం

Nov 20 2026 4:19 AM | Updated on Nov 20 2026 4:19 AM

International Court of Justice finds Myanmar guilty of genocide against Rohingya

2017 నాటి సైనిక చర్యపై ఐసీజే సంచలన తీర్పు 

బాధితులకు పునరావాసం కల్పించాలి 

పరిహారం కూడా చెల్లించాలని ఆదేశం

ది హేగ్‌/ఢాకా: మయన్మార్‌లో రొహింగ్యాలపై జరిగిన దారుణాలపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) చారిత్రక తీర్పు వెలువరించింది. 2017లో రఖైన్‌ రాష్ట్రంలో చేపట్టిన సైనిక చర్య సందర్భంగా అల్ప సంఖ్యాకులైన రొహింగ్యాలపై మయన్మార్‌ ప్రభుత్వం జనహననానికి పాల్పడిందని గురువారం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగంగా భావించే ఐసీజే, తన 80 ఏళ్ల చరిత్రలో జనహననానికి పాల్పడిందంటూ ఓ దేశ ప్రభుత్వాన్ని బాధ్యునిగా ప్రకటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

జెనోసైడ్‌ కన్వెన్షన్‌–1948 కింద 9–6 ఓట్ల తేడాతో ఈ తీర్పు వెలువరించినట్లు ఐసీజే అధ్యక్షుడు యుజి ఇవాసవా ప్రకటించారు. 2017లో మయన్మార్‌ సైన్యం దారుణాలకు తాళలేక దాదాపు 10 లక్షల మంది రొహింగ్యాలు పొరుగునే ఉన్న మయన్మార్‌కు తరలివచ్చారు. మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తూ జనహననాలకు పాల్పడుతోందంటూ 2019లో గాంబియా ఐసీజేలో పిటిషన్‌ వేసింది.

 ఐసీజే తీర్పును బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షమా ఒబేద్‌ ఇస్లాం చారిత్రకమంటూ స్వాగతించారు. రొహింగ్యాలకు భద్రతను, తగు గౌరవాన్ని కల్పించేందుకు తాము చేస్తున్న యత్నాలకు ఐసీజే ప్రకటన బలం చేకూర్చిందన్నారు. ‘జనహననానికి మేం బాధితులమన్న విషయం ప్రపంచం గుర్తించినట్లయింది. ఈ క్షణం కోసమే మేం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నాం’అని బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్‌ తాత్కాలిక శిబిరాల్లో ఉంటున్న రొహింగ్యాల నేత సయ్యదుల్లా పేర్కొన్నారు. 

తాము తిరిగి స్వదేశానికి చేరుకుని, సురక్షితమైన, గౌరవ ప్రదం జీవితం గడిపేలా ప్రభుత్వాలు మయన్మార్‌ సైనిక పాలకులపై ఒత్తిడి తెచ్చే సమయం వచి్చందన్నారు. అయితే, రఖైన్‌లోని రొహింగ్యాలపై మారణహోమం జరిగేలా మయన్మార్‌ ప్రభుత్వం ప్రత్యక్షంగా, బహిరంగంగానూ రెచ్చగొట్టలేదని తాము గుర్తించినట్లు ఐసీజే తెలిపింది. మారణహోమం ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యా లను భద్రపరచాలని 2020లో ఇచి్చన ఉత్తర్వులను మయన్మార్‌ ఉల్లంఘించిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. బాధితులను సురక్షితంగా, స్వచ్ఛందంగా, గౌరవప్రదంగా తిరిగి రానివ్వడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని కోరింది. పరిహారం, పునరావాస చర్యలకు సంబంధించిన విధివిధానాలను తదుపరి దశ విచారణలో నిర్ణయిస్తామంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement