11న ఇమ్రాన్‌ ఖాన్‌ విడుదల? | Imran likely to be released on June 11 | Sakshi
Sakshi News home page

11న ఇమ్రాన్‌ ఖాన్‌ విడుదల?

Jun 9 2025 11:07 AM | Updated on Jun 9 2025 11:07 AM

Imran likely to be released on June 11

హైదరాబాద్: అల్‌–ఖాదిర్‌ ట్రస్ట్‌ కేసులో బెయిల్‌ లభిస్తే జూన్‌ 11వ తేదీన పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యే వీలుందని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ పార్టీ చీఫ్‌ గోహర్‌ అలీఖాన్‌ ప్రకటించారు. దాదాపు రూ.2,200 కోట్ల అల్‌–ఖాదిర్‌ యూనివర్సిటీ ట్రస్ట్‌ కేసులో ఇమ్రాన్‌ ఖాన్, అతని భార్య బుష్రా బీబీలకు పడిన శిక్షలను రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇస్లామాబాద్‌ హైకోర్టు జూన్‌ 11న నిర్ణయం తీసుకోనుందని అలీఖాన్‌ ఆదివారం చెప్పారు. పదవి కోల్పోయాక 72 ఏళ్ల ఇమ్రాన్‌ 2023 ఆగస్ట్‌ నుంచి రావల్పిండి నగరంలోని అడియాలా జైలులో గడుపుతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement