మానవాళికి ముప్పు.. అణు యుద్ధం, ఏఐతో.. | Huge threat to humanity from nuclear war and AI | Sakshi
Sakshi News home page

మానవాళికి ముప్పు.. అణు యుద్ధం, ఏఐతో..

Oct 11 2026 7:36 PM | Updated on Oct 11 2026 7:40 PM

Huge threat to humanity from nuclear war and AI

లండన్: అణు యుద్ధం, కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగం మానవాళి మనుగడకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని ది లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. 2100 నాటికి ఈ పరిణామాలు మానవ వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రమాదం తక్కువగానే ఉందని పేర్కొంది. లాన్సెట్ కమిషన్ ఆన్ 21వ సెంచరీ గ్లోబల్ థ్రెట్స్ టు హెల్త్ నివేదికలో రాబోయే 75 ఏళ్లలో మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 17 ప్రధాన ముప్పులను గుర్తించారు. అందులో అణు యుద్ధం, ఏఐ దుర్వినియోగం, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, చిన్నారుల్లో పోషకాహార లోపం, ఊబకాయం వంటివి వీటిలో ఉన్నాయి.

ఏఐని దుర్వినియోగం చేయడం వల్ల లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని నిపుణులు హెచ్చరించారు. అణు యుద్ధం కారణంగా సూర్యరశ్మి తగ్గి, ఆహార ఉత్పత్తి దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఈ నివేదిక వివరించింది. వాతావరణ మార్పులు, అంటువ్యాధులు, యాంటీమైక్రోబయల్ నిరోధకత, మానసిక ఆరోగ్య సమస్యలు, ధూమపానం, యుద్ధాలు తదితర అంశాలనూ ప్రధాన ముప్పులుగా గుర్తించారు. అయితే ప్రభుత్వాలు వీటిపై ముందస్తు ప్రణాళికలు, నివారణ చర్యలు చేపడితే ఈ ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచించారు. ఈ నివేదికను 35 మంది నిపుణులతో కూడిన కమిషన్ రూపొందించింది. భవిష్యత్తులో రానున్న ముప్పులను సమీక్షిస్తూ ఏటా నివేదికను నవీకరించాలని కమిషన్ నిర్ణయించింది.

ఇదీ చదవండి: రెండో రోజు సీజేపీ నిరసనలు.. 100 మందికి పైగా అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement