‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్‌ ఈ వీడియో! | To Hide Mobile While Studying Child Cheated His Mother - Sakshi
Sakshi News home page

‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్‌ ఈ వీడియో!

Published Sat, Aug 26 2023 10:54 AM

Hide Mobile While Studying Child Mother also got Cheated - Sakshi

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. కొందరు కారును హెలికాప్టర్‌గా మారుస్తారు. మరికొందరు ఇటుకలతో కూలర్‌ను తయారు చేసేస్తారు. తాజాగా వీటన్నింటికి మించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.  దీనిని చూసినవారంతా నోరెళ్ల బెడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లాడి తెలివిని చూసి, అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటి పిల్లలు మొబైల్‌ ఫోను చూడటంతో ఎంత బిజీ అయిపోయారంటే వారు ఒక్క నిమిషం కూడా ఫోనును విడిచిపెట్టడం లేదు. 

ఒక కుర్రాడు ఒకవైపు చదువుకుంటున్నట్లు నటిస్తూ, దొంగచాటుగా మొబైల్‌ ఫోన్‌ ఎలా చూస్తున్నాడో ఈ వీడియోలో కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లవాడు టేబుల్‌పై కూర్చుని చదువుకోవడంతో పాటు అతని ముందున్న గోడకు ఆనుకుని, తీగతో మొబైల్ వేలాడదీయడాన్ని మనం గమనించవచ్చు. పిల్లాడు మొబైల్‌ చూడటంతో మునిగివుండగా, అప్పుడే తలుపు తెరిచి గదిలోకి ప్రవేశించింది ఆ కుర్రాడి తల్లి. ఇలా తల్లి తలుపు తెరవగానే.. గోడకు వేలాడుతున్న మొబైల్ వెంటనే టవల్ వెనుకకు చేరుకుంది. ఆ తల్లి గది నుండి బయటకు వెళ్లగానే మొబైల్‌ఫోన్‌ మళ్లీ ఆ  పిల్లాడి ముందు కనిపిస్తుంది. 

ఆ కుర్రాడు మొబైల్ ఫోనును తన తల్లికి తెలియకుండా దాచేందుకు ఎలా ప్రయత్నిస్తున్నాడో వీడియోలో స్పష్టగా కనిపిస్తుంది. ఈ వీడియో @TheFigen_ పేరుతో  X (ట్విట్టర్‌)లో షేర్‌ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్‌ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్‌ ఆ పిల్లవాడిని స్మార్ట్‌ బాయ్‌ అని పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి:  ‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు!
 

Advertisement
 
Advertisement