‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు! | Brother find out a tremendous solution of Rakhi - Sakshi
Sakshi News home page

‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు!

Aug 26 2023 9:52 AM | Updated on Aug 26 2023 10:24 AM

Brother Find out a Tremendous Solution of rakhi - Sakshi

రక్షాబంధన్.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తమ ఆత్మీయతను వ్యక్తపరిచేరోజు.  ఆ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అయితే సోదరులు ఈ వాగ్దానంతో పాటు తమ సోదరీమణులకు ఏదైనా కానుక ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ విషయంలో సోదరులు మల్లగుల్లాలు పడుతుంటారు. కాగా ఒక కుర్రాడు రాఖీ రోజున తనకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఒక లిస్టు తయారు చేశాడు. దానిని సోషల్‌ మీడయాలో షేర్‌ చేయగా, అది వెంటనే వైరల్‌గా మారింది. అతను తనకు వరుసకు సోదరీమణులయ్యేవారికి రాఖీ రోజున ఎంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలో ఆ పోస్టులో రాశాడు. 

పిన్ని కూతురికి 11 రూపాయలు.
ఎదురింటిలోని చెల్లెలికి 10 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్‌
స్కూల్‌లోని చెల్లెలికి 21 రూపాయలు.
ట్యూషన్‌లోని చెల్లెలికి 11 రూపాయలు. డైరీ మిల్క్‌ చాక్లెట్‌.
ఇంకా ఎక్కువ మంది సోదరీమణులు వస్తే వారికి 5 రూపాయల పర్క్‌ చాక్లెట్‌
నా సొంత సోదరికి ఒక రూపాయికి లభించే 2 ఎక్లెయిర్స్ టోఫీలు

ఈ కుర్రాడు రాఖీకి తనకు అయ్యే మొత్తం ఖర్చును 80 రూపాయలలో అడ్జెస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
@indian.official.memes అనే పేజీలో దీనిని షేర్‌ చేశారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్‌ చేశారు. ఈ పోస్టును చూసిన యూజర్లు దీనిని లైక్‌ చేస్తున్నారు. వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ 2000 మందికి పైగా లైక్ చేశారు. ఒక యూజర్‌ ఇలా రాశాడు.. ‘ఈ కుర్రాడు తన సొంత సోదరికి కేవలం ఒక రూపాయి విలువ చేసే 2 చాక్లెట్లు మాత్రమే ఇస్తున్నాడు. ఎంత క్రూరమైన సోదరుడు’ అని రాయగా మరొక యూజర్ ‘వావ్ బ్రదర్, వాట్ యాన్ ఐడియా’ అని రాశాడు. ఇంకొక యూజర్‌ ‘ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి’ అని రాశాడు. 
ఇది కూడా చదవండి: యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement