గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం 160 కి.మీ వేగంతో కారు నడిపి.. చివరికి

Florida Man Arrested For Speeding 160 Kph Girl Friend Interview - Sakshi

ఫ్లోరిడా: అమెరికాలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాలి. తన గర్ల్‌ఫ్రెండ్‌ని సరైన సమయానికి ఇంటర్వ్యూకి తీసుకువెళ్లాలని గంటకి 160కి.మీ. వేగంతో కారు నడిపిన వ్యక్తి ఇప్పుడు కటకటాలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఫ్లోరిడాకు చెందిన జెవన్‌ పీర్‌ జాక్సన్‌ (22) గంటకి 65కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించే జోన్‌లో నిబంధనల్ని బేఖాతర్‌ చేశాడు. ఏకంగా 160 కి.మీ వేగంతో కారు నడిపాడు.

మార్గం మధ్యలో కొన్ని వాహనాలను కూడా ఢీ కొట్టబోయి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. జాక్సన్‌ ఢీ కొట్టబోయిన ఒక వాహనంలో పోలీసు వాహనంతో పాటు ముగ్గురు చిన్నారులున్న మరో వాహనం ఉండడంతో అతని చుట్టూ ఉచ్చు బిగిసింది.  ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా, చిన్న పిల్లలకి హాని జరగబోయిందన్న కేసు పెట్టిన పోలీసులు జాక్సన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేశారు. అరెస్ట్‌ చేసి జైలుకి   తరలించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top