ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడా చూసుండరు | Family Circus On Cycle Funny Viral Video | Sakshi
Sakshi News home page

ఇలాంటి ఫ్యామిలీ నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌!

Jan 22 2021 8:49 AM | Updated on Jan 22 2021 3:21 PM

Family Circus On Cycle Funny Viral Video - Sakshi

వీడియో దృశ్యం

చిన్నారులతో సైకిల్‌ మొత్తం నిండిపోయినా.. దారి సరిగా కనిపించకపోయినా దాన్ని నడుపుతున్న వ్యక్తి ఎలాంటి అసహనానికి గురికాకపోవటం గమనార్హం.

ఆఫ్రికాకు చెందిన ఓ ఫ్యామిలీ చాలా ప్రత్యేకమైనది. ఎంతంటే?.. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేంత. వారి ప్రత్యేకత ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఒకే సైకిల్‌ మీద ప్రయాణించటం. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా పది మంది సైకిల్‌ మీద సర్కస్‌ చేస్తున్నట్లు ఒకరిపై ఒకరు కూర్చుని ప్రతీ రోజు జర్నీ చేస్తారు. చిన్నారులతో సైకిల్‌ మొత్తం నిండిపోయినా.. దారి సరిగా కనిపించకపోయినా దాన్ని నడుపుతున్న వ్యక్తి ఎలాంటి అసహనానికి గురికాకపోవటం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన 48 సెకన్ల నిడివి కలిగిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ( అతడికి సెల్యూట్‌.. నిజంగా రియల్‌ హీరో )

దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఫ్యామిలీ సర్కస్‌‌ అంటే ఇదేనేమో’’.. ‘‘ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడా చూసుండరు’’.. ‘‘ నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌ ఫ్యామిలీ’’.. ‘‘ ఈ ఫ్యామిలీని గిన్నిస్‌ బుక్‌లో ఎక్కించాలి!’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఆఫ్రికాలో ఎక్కడ జరిగింది. వారు ఎవరు అన్న సంగతి మాత్రం తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement