అతడికి సెల్యూట్.. నిజంగా రియల్ హీరో

న్యూఢిల్లీ : అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించాడు ఓ సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది. ఈ సంఘటన ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జనక్‌పురికి చెందిన సత్యనారన్ అనే వ్యక్తి దబ్రీ మోర్ మెట్రో స్టేషన్‌లో ఉన్నట్టుండి నేలపై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అక్కడి సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాడు. నేలపై పడి ఉన్న సత్యనారన్‌కు సీపీఆర్(కార్డియోపల్మనరీ రెససిటేషన్) చేసి ప్రాణం రక్షించాడు. (ఆఫ్రికన్ బ్రహ్మానందం.. ఒసితా ఇహెమ్ )
అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘అతడికి నగదు బహుమతి ఇవ్వాలి’’.. ‘‘ఆ సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సెల్యూట్, నిజంగా రియల్ హీరో’’..‘‘ ఓ విలువైన ప్రాణం కాపాడిన ఆ వ్యక్తికి ధన్యవాదాలు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి