రూ.1.97లక్షల కోట్ల ఎలాన్ మస్క్ సంపద ఆవిరి

Elon Musk Loses 27 Billion Dollars in 4 Days - Sakshi

క‌రోనా సంక్షోభ కాలంలో కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కానీ,గత ఏడాది కలిసి వచ్చిన అదృష్ట్టం ఈ సారి పోయేలాగ కనిపిస్తుంది. క‌రోనా అనంత‌రం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టడానికి అమెరికా ప్రభుత్వం విడుద‌ల చేసిన బాండ్ల కొనుగోలు వైపు పెట్టుబ‌డిదారులు పోటీ ప‌డుతున్నారు. ఫ‌లితంగా స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప‌రిస్థితులతో టెస్లా షేర్లు ప‌త‌నం అయ్యాయి. ఇప్పటికే గత నెల ఒక చిన్న ట్విట్ కారణంగా లక్ష కోట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

గ‌త‌వారం సోమవారం - శుక్రవారం మధ్య ఎల‌న్‌మ‌స్క్ నిక‌ర సంప‌ద ఏకంగా రూ.1.97 ల‌క్ష‌ల కోట్లు(27 బిలియన్‌ డాలర్లు) కరిగిపోయింది. రూ.1.97లక్షల కోట్లు కోల్పోవడం వల్ల బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం ప్ర‌స్తుతం ఆయ‌న సంప‌ద‌ 156.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. రెండో రోజుల క్రితమే  ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలోన్ మస్క్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌ కంటే ఎలోన్ మస్క్‌ సంపద 20 బిలియన్‌ డాలర్లు తక్కువగా ఉంది. ఒక్క వారంలోనే టెస్లా సంస్థ షేర్ల విలువ 11 శాతం పడిపోయింది.  

జనవరిలో టెస్లా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ  837 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 574 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2020లో కంపెనీ షేర్ల విలువ 743 శాతం పెరగడంతో ఏడాదిలోనే మస్క్‌ సంపద కూడా భారీగా పెరిగింది. కొత్త ఏడాదిలోను ప్రారంభంలో అదే జోరు కొనసాగించి జెఫ్ బెజోస్‌ను కూడా దాటి వేసిన సందర్భం ఉంది. అయితే, మార్కెట్ల ప్రతికూలతలతో ఆ స్థానంలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేక పోయారు. ఇటీవల టెస్లా పెట్టుబడులు పెట్టిన బిట్ కాయిన్ విలువ కూడా పడిపోయింది.

చదవండి:

కరోనాతో ప్రజలకు రూ.13లక్షల కోట్ల నష్టం!

తొలి ట్వీట్‌ ఖరీదు రూ.18.30 కోట్లు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top