ఈక్వెడార్‌లో ముదిరిన హత్యా రాజకీయాలు..వారం రోజుల్లో ఇద్దరు హతం..

Ecuador Election Season Gets Bloodier Another Politician Assassinated - Sakshi

క్విటో: త్వరలో జరగనున్న ఈక్వెడార్ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల వరుస హత్యలు అక్కడ సంచలనం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే సిటిజన్ రివొల్యూషన్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్షియా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా కాల్చి చంపబడ్డారు. ఆ సంఘటన మరువక ముందే అదే పార్టీకి చెందిన మరో నాయకుడు పెడ్రో బ్రయోన్స్ ను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు దుండగులు. పెడ్రో బ్రయోన్స్ ఎస్మెరాల్డాస్ ప్రావిన్సులోని కొలంబియా సరిహద్దు ఉద్యమంలో కీలక నాయకుడు. 

ఈ హత్య అనంతరం సిటిజన్ రివొల్యూషన్ పార్టీ మరో రాష్ట్రపతి అభ్యర్థి లూయిసా గొంజాలెజ్ బ్రయోన్స్ కు నివాళులు అర్పిస్తూ.. పెడ్రో బ్రయోన్స్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం ఈక్వెడార్‌లో రక్తం ఏరులై పారుతోందని చెబుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం నేర సామ్రాజ్యాన్ని విస్తరించిందని చెబుతూనే ఇదొక పనికిమాలిన ప్రభుత్వంగా ఆమె వర్ణించారు.     

ఆగస్టు 9న సిటిజన్ రివొల్యూషన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్న ఫెర్నాండో విల్లావిసెన్షియాను అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. క్విటో నగరంలో ఒకచోట ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తన వాహనంలోకి వెళ్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. చుట్టూ సెక్యూరిటీ వలయం ఉండగానే హత్య జరగడం విశేషం. అవినీతికి వ్యతిరేకంగా విల్లావిసెన్షియా తన స్వరాన్ని చట్టసభల్లో చాలా బలంగా వినిపించేవారు. ఇదే క్రమంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో విల్లావిసెన్షియా అధ్యక్షుడి రేసులో ముందువరసలో ఉన్నారు. కానీ ఎన్నికలు జరిగే లోపే ప్రత్యర్థి తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఎన్నికల తంతు ముగిసేలోపు ఇంకెన్ని హత్యలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. 

ఇది కూడా చదవండి: Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్‌ఫ్రెండ్.. ఏం చేశారంటే?    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top