చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై

Economist Intelligence Unit released survey report 2023 - Sakshi

ప్రపంచంలో టాప్‌–10లో చోటు 

ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. ప్రఖ్యాత ‘ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసి, సర్వే నిర్వహించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాల్లో నిత్యావసరాల నుంచి ఇంటి అద్దెల దాకా వివిధ ధరలను పరిశీలించి.. జీవించడానికి అయ్యే ఖర్చును తేల్చామని పేర్కొంది.

ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ నగరాలు అత్యధిక జీవన వ్యయంలో టాప్‌లో నిలిచాయి. నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం గణనీయంగా ఉండటంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో జీవన వ్యయం పెరుగుతోందని తెలిపింది. ఇక తక్కువ వ్యయం ఉండే నగరాల్లో ఆసియా ఖండానికి చెందినవే ఎక్కువగా ఉన్నా యని నివేదిక వెల్లడించింది.    – సాక్షి సెంట్రల్‌డెస్క్‌  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top