Sakshi News home page

Africa Earth Cracks: 56 కి.మీ. మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ..

Published Sat, Jun 24 2023 1:13 PM

Earth is Cracking Rapidly in Africa - Sakshi

భూమిపై అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే వాతావరణ మార్పులు కూడా సకల జీవజాతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలో విస్తృతంగా భూమికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. నిపుణులు కూడా దీనిని పకృతి వైపరీత్యంగా పేర్కొంటున్నారు. గత మార్చినెలలో ఆఫ్రికాలో భూమి పగుళ్లు విస్తృతంగా కనిపించాయి. అలా పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో భూమి రెండుగా చీలిపోయి, స్థానికులను భయకంపితులను చేస్తోంది. ఈ పగుళ్లు ఏకంగా 56 కిలోమీటర్ల మేరకు ఉండటం విశేషం. ఈ పగుళ్లు జూన్‌ నాటికి మరింత విస్తరించాయి. ఇవి మరింతగా కొనసాగుతున్నాయి. 

లండన్‌కు చెందిన జియోలాజికల్‌ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఎర్ర సముద్రం మొదలుకొని మోజాంబిక్‌ వరకూ సుమారు 35 కిలోమీటర్ల మేరకు పొడవైన పర్వతశ్రేణులున్నాయి. ఈ ప్రాంతంలో త్వరగా వాతావరణ మార్పులు  చోటుచేసుకుంటున్నాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోయి, మధ్య నుంచి మహాసాగరం ఏర్పడనుంది. దీనిపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు టెక్టోనిక్‌ ప్లేట్‌లను అధ్యయనం చేస్తున్నారు. 

ఈ విపత్కర పరిస్థితులపై నాసా కూడా దృష్టి సారించింది. దీనిపై నాసాకు చెందిన అర్త్‌ అబ్జర్వేటరీ వివరాలు వెల్లడిస్తూ ఈస్ట్‌ ఆఫ్రికాలోని సోమాలియా టెక్టోనిక్‌ ప్లేట్‌ న్యూబియాన్‌ టెక్టోనిక్‌ ప్లేట్‌కు తూర్పు దిశగా బలంగా కదులుతోంది. ఆఫ్రికాలో చోటుచేసుకున్న పరిణామాలపై జియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ కూడా పరిశోధనలు సాగిస్తోంది.ఇథియోపియాలో భూమి వై ఆకారంలో చీలిపోతోందని తెలిపింది. కాలిపోర్నియా యూనివర్శిటీకిచెందిన ప్రొఫెసర్‌ అమెరిటస్‌ కెన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం భూమి పగుళ్ల ప్రక్రియ నెమ్మదిగా జరగుతున్నదని, భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమన్నారు. 

ఇది కూడా చదవండి: మురికి బెడ్‌షీట్‌తో హఠాత్‌ అగ్నిప్రమాదాలు.. హెచ్చరించిన ఫైర్‌ ఫైటర్స్‌!

Advertisement

What’s your opinion

Advertisement