breaking news
crack in the earth
-
56 కి.మీ. మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ..
భూమిపై అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే వాతావరణ మార్పులు కూడా సకల జీవజాతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలో విస్తృతంగా భూమికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. నిపుణులు కూడా దీనిని పకృతి వైపరీత్యంగా పేర్కొంటున్నారు. గత మార్చినెలలో ఆఫ్రికాలో భూమి పగుళ్లు విస్తృతంగా కనిపించాయి. అలా పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో భూమి రెండుగా చీలిపోయి, స్థానికులను భయకంపితులను చేస్తోంది. ఈ పగుళ్లు ఏకంగా 56 కిలోమీటర్ల మేరకు ఉండటం విశేషం. ఈ పగుళ్లు జూన్ నాటికి మరింత విస్తరించాయి. ఇవి మరింతగా కొనసాగుతున్నాయి. లండన్‌కు చెందిన జియోలాజికల్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఎర్ర సముద్రం మొదలుకొని మోజాంబిక్ వరకూ సుమారు 35 కిలోమీటర్ల మేరకు పొడవైన పర్వతశ్రేణులున్నాయి. ఈ ప్రాంతంలో త్వరగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోయి, మధ్య నుంచి మహాసాగరం ఏర్పడనుంది. దీనిపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు టెక్టోనిక్ ప్లేట్లను అధ్యయనం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులపై నాసా కూడా దృష్టి సారించింది. దీనిపై నాసాకు చెందిన అర్త్ అబ్జర్వేటరీ వివరాలు వెల్లడిస్తూ ఈస్ట్ ఆఫ్రికాలోని సోమాలియా టెక్టోనిక్ ప్లేట్ న్యూబియాన్ టెక్టోనిక్ ప్లేట్‌కు తూర్పు దిశగా బలంగా కదులుతోంది. ఆఫ్రికాలో చోటుచేసుకున్న పరిణామాలపై జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ కూడా పరిశోధనలు సాగిస్తోంది.ఇథియోపియాలో భూమి వై ఆకారంలో చీలిపోతోందని తెలిపింది. కాలిపోర్నియా యూనివర్శిటీకిచెందిన ప్రొఫెసర్ అమెరిటస్ కెన్ మాట్లాడుతూ ప్రస్తుతం భూమి పగుళ్ల ప్రక్రియ నెమ్మదిగా జరగుతున్నదని, భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమన్నారు. ఇది కూడా చదవండి: మురికి బెడ్‌షీట్‌తో హఠాత్ అగ్నిప్రమాదాలు.. హెచ్చరించిన ఫైర్ ఫైటర్స్! -
భూమికి భారీ పగుళ్లు..!
అమెరికాలోని కొండ ప్రాంతాల్లో భారీ పగుళ్లు వచ్చాయి. వ్యోమింగ్స్ బైఘర్న్ పర్వత సానువుల్లో 15 రోజుల కిందట తలెత్తిన ఈ భారీ పగుళ్లను తాజాగా గుర్తించారు. ఈ పగుళ్లకు సంబంధించిన ఫొటోలను మొదట ఎస్ఎన్ఎస్ ఔట్ఫిటర్స్ అండ్ గైడ్ సర్విస్ సంస్థ ప్రచురించింది. 750 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో ఏర్పడిన ఈ పగుళ్లు.. చూడటానికి అబ్బురపరుస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ భారీ పగుళ్ల వెనుక పెద్ద మిస్టిరియస్ కారణాలు ఏమీ లేవని నిపుణులు చెబుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వానాకాలం కారణంగా క్యాప్ రాక్ పర్వతాలు మెత్తబడి.. చీలిక వచ్చి ఉంటుందని.. ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఎస్ఎన్ఎస్ ఇంజినీర్ ఒకరు తెలిపారు. కొండచరియలు నెమ్మదిగా కదలడం వల్ల పర్వతాల మధ్య ఈ భారీ చీలిక ఏర్పడి ఉంటుందని, దాదాపు 15 నుంచి 20 మిలియన్ అడుగుల మేర కొండచరియలు కదిలి ఉంటాయని భూగర్భ పరిశోధక సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.