బైడెన్‌పై అంత ప్రేమెందుకు?: ట్రంప్‌

Donald Trump slams media for blocking balleged graft cases against Joe Biden - Sakshi

మిల్వాకీ(యూఎస్‌): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ సాగించిన అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా అమెరికన్‌ మీడియా, బడా టెక్నాలజీ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. బైడెన్‌పై మీడియాకు అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. మాస్కో మాజీ మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన జో బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్‌ డాలర్లు అందినట్లు ట్రంప్‌ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోపణలను బైడెన్‌ ఖండించారు. బైడెన్‌ నుంచి ప్రయోజనాలు పొందిన మీడియా సంస్థలు, టెక్‌ కంపెనీలు మాత్రం ఆయనను కాపాడేందుకు ఆరాట పడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పక్షపాత వైఖరి చివరకు మీడియాకే నష్టం కలిగిస్తుందని అన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్రభుత్వ సూపర్‌ ఎకనామిక్‌ రికవరీకి, బైడెన్‌ డిప్రెషన్‌కు మధ్య పోటీ జరుగుతోందని, ప్రజలు దేన్ని ఎంచుకుంటారో నిర్ణయించుకోవాలని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top