
మియామి: వలసదారుల బహిష్కరణలు, సుంకాలతో హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కాస్త రిలాక్సయ్యారు. తన బృందంలో కీలక సభ్యులైన ఎలాన్ మస్క్, తులసీ గబార్డ్ తదితరులతో కలిసి ఫ్లోరిడాలోని మియామిలో అలి్టమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని తిలకించారు. అభిమానులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేసి, పిడికిలి బిగించి ఉత్సాహపరిచారు.
పూర్తిగా ఫిట్
78 ఏళ్ల ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసే సామర్ధ్యం ఆయనకుందని పేర్కొన్నారు. శుక్రవారం ట్రంప్‌కు జరిపిన సాధారణ వైద్య పరీక్షల ఫలితాలను వైట్‌హౌస్ విడుదల చేసింది. ‘2020లో అధ్యక్షుడిగా ఉండగా చివరిసారిగా జరిపిన పరీక్షల్లో ట్రంప్ 110.677 కిలోలుండగా ఇప్పుడు 9 కిలోలు తగ్గారు.
రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గాయి. అధ్యక్షుడిగా రోజూ సమావేశాలు, సభల్లో భేటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ గోల్ఫ్ పోటీలో విజేతగా నిలిచారు కూడా. ఆరోగ్యవంతుల్లో కొలెస్టరాల్ స్థాయి 200కు మించరాదు. బీపీ మాత్రం కాస్త ఎక్కువ (128/74)గా ఉంది. హృదయ స్పందన రేటు గతంలో మాదిరిగా 62గానే ఉంది. గుండెపోటు రిస్‌్కను నివారించేందుకు ట్రంప్ నిత్యం ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు’’ అని పేర్కొంది.
Trump Dance at UFC 314 🇺🇸 pic.twitter.com/Ud01BkHp8M
— Margo Martin (@MargoMartin47) April 13, 2025