Optical Illusion: Is This A Dark Tunnel Or A Forest? - Sakshi
Sakshi News home page

చీకటి సొరంగమా?.. దట్టమైన అడవా?.. అబ్బురపరుస్తున్న వీడియో!

Aug 22 2023 7:47 AM | Updated on Aug 22 2023 10:42 AM

Is This a Dark Tunnel or a Forest See Viral Video - Sakshi

ఆప్టికల్‌ ఇల్యూజన్(దృష్టి భ్రాంతి) అనేది ఒక్కోసారి మనల్ని గందరగోళానికి గురిచేస్తుంటుంది. తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ అయిన ఒక వీడియో ఇటువంటివి చూడాలనే ఆసక్తి కలిగినవారిని ఎంతగానో అలరిస్తోంది. వీడియో ప్రారంభంలో ఒక అంథకారమయమైన గుహ కనిపిస్తుంది. క్లిప్‌ ముందుకు వెళుతున్న కొద్దీ మరో విధంగా మారిపోతుంది. 

ఈ వీడియోను ట్విట్టర్‌లో @Rainmaker1973 హ్యాండిల్‌ నుంచి షేర్‌ చేశారు. ఈ వీడియోను ఏదో కారు లోపలి నుంచి రికార్డు చేశారు. వీడియోలో కారు ఒక చీకటి సొరంగం గుండా వెళుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ వాహనం ఆ కనిపించే సొరంగం దగ్గరకు చేరుకోగానే అది భ్రమ అని తేలిపోతుంది. అటునిటు దట్టంగా ఉన్న చెట్లు కనిపిస్తాయి. 

ఈ పోస్టు క్యాప్షన్‌లో @Rainmaker1973 ఇలా రాశారు..‘థాయ్‌ల్యాండ్‌ పాహిలి ప్రాంతంలో చెట్లతో కూడిన ఈ సొరంగం విచిత్రమైన భ్రాంతిని కలుగజేస్తుంది. దూరం నుంచి ఎంతో చీకటిగా కనిపిస్తుంది. అయితే ముందుకు సాగగానే వెలుతురు ప్రవేశించి, ‍ప్రకృతి సహజ సౌందర్యం ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఈ వీడియోను ఆగస్టు 10న షేర్‌ చేయగా, ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా వ్యూస్‌ లభించాయి. ఈ వీడియోను చూసిన చాలామంది లైక్స్‌ చేయడంతోపాటు, పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్‌  ‘ప్రకృతి ఒక్కోసారి ఎంతో ఆసక్తిగొలుపుతుంది’ అని రాశారు. మరో యూజర్‌ ‘ఇది ఎంతో బాగుంది. ఒక సినిమా సీన్‌ను తలపిస్తోంది’ అని రాశారు. ఇంకొక యూజర్‌ ‘రాత్రివేళ దీని గుండా ప్రయాణించడాన్ని ఊహించండి’ అని రాశారు. 
ఇది కూడా చూడండి: నాడు సీమా, నేడు సానియా.. ‍ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement