చైనాలో  10జీ నెట్‌వర్క్‌..! | China Launched The World First Commercial 10-gigabit Broadband Network, More Details Inside | Sakshi
Sakshi News home page

చైనాలో  10జీ నెట్‌వర్క్‌..!

Apr 22 2025 6:03 AM | Updated on Apr 22 2025 9:34 AM

China launched the world first commercial 10-Gigabit broadband network

బీజింగ్‌: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో డ్రాగన్‌ దేశం చైనా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా 10 గిగాబైట్స్‌ ఫర్‌ సెకన్స్‌() వేగంతో పనిచేసే 10జీ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.

 రాజధాని బీజింగ్‌ సమీపంలోని హుబే ప్రావిన్స్‌లో చేపట్టిన ప్రయోగ పరీక్షలో గరిష్టంగా 10 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ పని చేసినట్లు మీడియా వెల్లడించింది. ఈ వేగంతో అత్యంత స్పష్టతతో కూడిన రెండు పూర్తి సినిమాలను కేవలం సెకన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. క్లౌడ్‌ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్‌ తదితర రంగాల్లో దీనితో ఎన్నో మార్పులు సంభవించనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement