అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్న బాంబ్‌ సైక్లోన్‌.. భయానక వీడియోలు ఇవే.. | Sakshi
Sakshi News home page

Bomb Cyclone: అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్న బాంబ్‌ సైక్లోన్‌.. భయానక వీడియోలు ఇవే..

Published Sun, Dec 25 2022 6:51 PM

Bomb Cyclone Effect Boiling Water Turning Into Snow Video Viral - Sakshi

Bomb Cyclone.. అగ్రరాజ్యం అమెరికా.. బాంబ్‌ సైక్లోన్‌ ధాటికి వణికిపోతోంది. మంచు తుఫాన్‌ కారణంగా దాదాపు 13 రాష్ట్రాల్లో అమెరికన్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలో నుంచి బయట అడ్డుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. మంచు తుఫాన్‌ క్రిస్మన్‌ పండుగపై కూడా ఎఫెక్ట్‌ చూపించింది. తుఫాను కారణంగా పండుగ వేళ దేశ వ్యాప్తంగా దాదాపు 5,700 విమానాలను అధికారులు రద్దు చేశారు. పలు చోట్ల రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రోడ్డు మార్గాలను మూసివేశారు. 

దీంతో, క్రిస్మస్‌ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని 60 శాతం మందిపై ఈ మంచు తుఫాను ప్రభావం పడింది. అమెరికా లెక్కల ప్రకారం.. మంచు తుఫాన్‌ కారణంగా ఇప్పటికే 18 మంది మృతిచెందారు. మంచుతుఫాన్‌ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్‌ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరిగే నీటిని సైతం గాల్లోకి విసిరితే సెకన్ల కాలంలో ఆ నీరు మంచులా మారిపోతోంది. కాగా, అమెరికా మంచు తుఫాను ధాటికి వాహనాలు కూడా రోడ్డుపై జారుకుంటూ వెళ్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

బాంబ్‌ సైక్లోన్‌ అంటే.. 
బాంబ్‌ సైక్లోన్‌ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట. 

బాంబు తుపాన్‌ ఎలా  ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది.

జనావాసాలపై బాంబ్‌ సైక్లోన్‌ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది.

Advertisement
Advertisement