బోటులో అగ్నిప్రమాదం.. 40 మంది హైతీ పౌరులు మృతి | Boat Fire Kills At Least 40 Haitian Migrants | Sakshi
Sakshi News home page

బోటులో అగ్నిప్రమాదం.. 40 మంది హైతీ పౌరులు మృతి

Jul 20 2024 8:32 AM | Updated on Jul 20 2024 9:52 AM

Boat Fire Kills At Least 40 Haitian Migrants

పోర్ట్‌ ఓ ప్రిన్స్‌ : హైతీ నుంచి 80 మంది శరణార్థులతో వెళుతున్న బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సమారు 40 మంది మృతి చెందారు. మరో 40 మందిని హైతీ రక్షక దళం కాపాడింది.

హైతీలోని సెయింట్‌ మైఖేల్‌ నార్త్‌ నుంచి బయలుదేరిన ఈ పడవ కాయ్‌కోస్‌, టర్క్స్‌ ఐలాండ్‌కు వెళుతోంది. పడవలో ఉన్నవారు క్యాండిల్స్‌ వెలిగించారు.

దీంతో  ఈ మంటలు బోటులో ఉన్న పెట్రోల్‌ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హైతీ గత కొంత కాలంగా సామాజిక, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో పౌరులు దేశం విడిచి వలస వెళుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement