‘షేక్‌ హసీనాను మాకు అప్పగించండి’ | Bangladesh SCBA President urges India about Sheikh Hasina | Sakshi
Sakshi News home page

‘షేక్‌ హసీనాను మాకు అప్పగించండి’

Aug 7 2024 9:49 AM | Updated on Aug 7 2024 10:53 AM

Bangladesh SCBA President urges India about Sheikh Hasina

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని ఆదేశ ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ, సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈబీఏ) ప్రెసిడెంట్‌ ఏఎమ్‌ మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌కు విజ్ఞప్తి చేశారు.

దేశంలో చెలరేగిన అల్లర్ల అనంతరం తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన షేక్‌ హసీనా,ఆమె సోదరి షేక్‌ రహానాను తమకు అప్పగించాలని ఖోకాన్‌ భారత్‌ను కోరినట్లు బంగ్లాదేశ్‌ మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది.

చదవండి : బ్రిటన్‌ నిరాకరణ!.. మరికొద్ది రోజులు భారత్‌లోనే హసీనా

ఎస్‌ఈబీఏ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖోకాన్‌ మాట్లాడారు. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చెబుతూనే.. తమ దేశం నుంచి పారిపోయి విదేశంలో తలదాచుకుంటున్న హసీనాను అరెస్ట్‌ చేసి తమకు అప్పగించాలని వ్యాఖ్యానించారు.

బంగ్లాదేశ్‌లో అమాయకుల ప్రాణాలు కోల్పోయారని, వారిని హసీనానే చంపారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఖోకాన్‌ దేశంలో అత్యవసర పరిస్థితికి పిలుపునివ్వాలని అన్నారు. వారం పది రోజుల్లో సుప్రీం కోర్టు న్యాయవాదులు రాజీనామాలు చేసి అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement