యూఎస్‌ఎయిడ్‌ ఉద్యోగులకు సెలవులు  | Almost all USAID workers across the globe placed on leaves | Sakshi
Sakshi News home page

యూఎస్‌ఎయిడ్‌ ఉద్యోగులకు సెలవులు 

Feb 6 2025 6:27 AM | Updated on Feb 6 2025 6:27 AM

Almost all USAID workers across the globe placed on leaves

30 రోజుల్లోగా స్వదేశానికి తిరిగిరావాలని ఆదేశం

వాషింగ్టన్‌:  అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పని చేస్తున్న యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ఎయిడ్‌) ఉద్యోగులను సెలవులపై ఉండాలని, విధులకు రావొద్దని ఆదేశించింది. అత్యవసర విధుల్లో ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది. యూఎస్‌ఎయిడ్‌లో ప్రత్యక్షంగా నియమితులైన ఉద్యోగులంతా బలవంతంగా సెలవులపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

వారంతా 30 రోజుల్లోగా స్వదేశానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం నోటీసును ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. యూఎస్‌ఎయిడ్‌ సంస్థ గత 60 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇది అమెరికా ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉంటూనే స్వతంత్రంగా పనిచేసే సంస్థ. యుద్ధాలు, విపత్తులు, సంక్షోభాల్లో చిక్కుకున్న దేశాల్లో ప్రజలకు మానవతా సాయం అందించడం యూఎస్‌ఎయిడ్‌ బాధ్యత. ఇందుకోసం అమెరికా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. 

ఇటీవల డొనాల్ట్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చులకు కళ్లెం వేస్తున్నారు. ఇందులో భాగంగానే యూఎస్‌ఎయిడ్‌ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేశారు. ప్రపంచదేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దుచేసే దిశగా ట్రంప్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది యూఎస్‌ఎయిడ్‌ సిబ్బందిని విధుల నుంచి తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విదేశాలకు తామెందుకు ఆర్థిక సాయం అందించాలని ట్రంప్‌ ప్రశి్నస్తున్నారు. అమెరికా ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, యూఎస్‌ఎయిడ్‌ సిబ్బందిని ఇంటికి పంపించడాన్ని అమెరికన్‌ ఫారిన్‌ సరీ్వసు అసోసియేషన్‌ వ్యతిరేకిస్తోంది. ట్రంప్‌ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని 
అంటోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement