చైనాకు గట్టి కౌంటరిచ్చిన భారత్‌..!

Airlines Informally Told To Block Entry Of Chinese Into India - Sakshi

‘చైనా పౌరులను భారత్‌ విమానాల్లోకి ఎక్కించవద్దు’

న్యూఢిల్లీ : చైనా పౌరులను భారత్‌ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను  కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి. కాగా గతంలో కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న తరుణంలో భారత్‌ చైనాతో విమాన సర్వీసులను నిలిపివేసింది. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం పలు దేశాలతో భారత్ 2ఎయిర్ బబూల్స్’ తెరచడంతో ఆ దేశాల్లో నివసించే చైనా పౌరులు వ్యాపార, ఉద్యోగ పనుల కోసం భారత్ రావడానికి అవకాశం ఏర్పడింది. దీంతో చైనా పౌరులు భారతదేశంతో ఎయిర్ బబుల్ ఉన్న దేశాల ద్వారా పర్యాటక వీసాలను మినహాయించి నిర్దిష్ట రకాల వీసాలపై ఇండియకు రాకపోకలను కొనసాగిస్తున్నారు. నవంబర్ నుంచి భారత పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా చైనా కూడా నిషేధం విధించింది. కరోనా కారణంగా భారత్ సహా విదేశీ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ అప్పటికే మంజూరు చేసిన వాటిని రద్దుచేసింది. ‘చైనా రాయబార కార్యాలయం / కాన్సులేట్లలో పైన పేర్కొన్న వర్గాలకు వీసా లేదా నివాస అనుమతులకు సంబంధించి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయబోం’ అని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం నవంబర్ 5న తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. చదవండి: 2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి

మరో వైపు చైనా పౌరులు తమ విమానాల్లో భారత్‌లోకి ప్రయాణించవద్దని గతవారం రోజులుగా స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలు చెబుతున్నాయి. టూరిస్ట్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేయగా.. వ్యాపార, ఇతర విభాగాలకు చెందిన విదేశీ వ్యక్తులను నాన్-టూరిస్ట్ వీసాలపై అనుమతిస్తోంది. ఐరోపాలోని ఎయిర్ బబూల్స్ దేశాల నుంచి చాలా మంది చైనీయులు భారత్‌కు వస్తున్నట్టు విమానయా సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారత్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్న చైనా పౌరులకు బోర్డింగ్ నిరాకరించడానికి కారణం చెప్పడానికి తమకు లిఖితపూర్వకంగా ఏదో ఒక ఉత్తర్వులు ఇవ్వాలని కొన్ని విమానయాన సంస్థలు అధికారులను కోరుతున్నాయి. అయితే ఇటీవల చైనాలోని వివిధ ఓడరేవులలో భారతీయులు చిక్కుకున్నప్పుడు, వారిని తమ తీరంలో దిగడానికి చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య ఓడల్లో పనిచేస్తున్న దాదాపు 1,500 మంది భారతీయ సిబ్బంది స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చైనా పాల్పడుతున్న చర్యలకు ధీటుగా సమాధానం చెప్పాలని భావిస్తోన్న భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top