భూకంపం ధాటికి.. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ | After Strong Earthquake Thailand Bangkok Declares Emergency Details | Sakshi
Sakshi News home page

Earthquake: బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ప్రకటన.. మరోసారి భూకంప హెచ్చరికలు

Mar 28 2025 2:10 PM | Updated on Mar 28 2025 2:36 PM

After Strong Earthquake Thailand Bangkok Declares Emergency Details

బ్యాంకాక్‌: మయన్మార్‌ భారీ భూకంపం పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌పైనా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఉత్తర భాగం.. ప్రత్యేకించి రాజధాని బ్యాంకాక్‌ భారీ ప్రకంపనతో వణికిపోయింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. వందల భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. 

ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేలమట్టమైన బహుళ అంతస్థుల శిథిలాల కింద ఎంత మంది చిక్కుకుని ఉంటారన్న దానిపై అంచనాకి రాలేకపోతున్నారు. మరోసారి భూకంపం వస్తుందన్న అంచనాలతో అధికారులు బ్యాంకాక్‌లో భవనాలను ఖాళీ చేయిన్నారు. మెట్రో, రైలు సేవలు నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు దెబ్బ తినడంతో సర్వీసులను నిలిపివేసి లాక్డౌన్‌ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

భూకంపం ధాటికి విద్యుత్‌ సేవలకు, పలు చోట్ల ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ పర్యాటక నగరం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగతిన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని అక్కడ స్థిరపడ్డ తెలుగు వ్యాపారి ఒకరు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement