అఫ్గాన్ భూకంప విలయం.. 2000 మంది మృతి

Afghanistan Earthquake Houses Flattened - Sakshi

కాబూల్‌: ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు దశాబ్దాల్లో ఇంతస్థాయిలో భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు తెలిపారు. వేలాది ఇళ్లు నేలకూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అఫ్గాన్‌–ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలోని హీరట్‌ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. భూకంప ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 400కు పైగా ఇళ్లు నేలకూలాయి. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.

గత ఏడాది తూర్పు ఆఫ్గానిస్థాన్‌లో భయంకరమైన భూకంపం సంభవించింది. కొండప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ భూకంపంలో దాదాపు 1000 నుంచి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో మరింత దారుణం.. యుద్ధంలోకి ‘హెజ్బొల్లా’ గ్రూప్‌

Follow the Sakshi Telugu News channel on WhatsApp: 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top