రియాద్: సౌదీ అరేబియాపై యోమన్ హూతీలు రెచ్చిపోయారు. ఈ దేశంలోని పౌర సముదాయాలతో పాటు ఆర్థిక కేంద్రాలే లక్షంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకపడ్డారు.దక్షిణ ప్రాంతంలో ఉన్న పలు ఇంధన రంగానికి చెందిన సంస్థలు, కీలక స్థావరాలే టార్గెట్‌గా దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో 73 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు.
కాగా ఈ దాడులు తమ చర్యలేనని హౌతీలు ప్రకటించారు. సౌదీ-యెమెన్ సరిహద్దుకు సమీపంలోని అబ్హా, జిజాన్ ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన సౌకర్యాలతో పాటు అబ్హా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖాలిద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ దాడులపై సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సౌదీ స్పష్టం చేసింది. పౌరులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేయడం తక్షణమే నిలిపివేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మరోవైపు యెమెన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సౌదీ మద్దతుతో ఉన్న ఆ దేశ ప్రభుత్వం, హూతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎదురుదాడిని ప్రారంభించింది. దీనికి ప్రతిగా హూతీలు సౌదీ అరేబియాపై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లోని ఓ జైలుపై జరిపిన దాడిలో 11 మంది మరణించారు. దానికి ప్రతికారంగా ఈ దాడులు జరిపినట్లు హూతీలు ప్రకటించారు.
🚨🇸🇦Houthi Attacks Hit Saudi Arabia
Yemen’s Iran-aligned Houthis launched attacks on Saudi Arabia, with strikes reported in Abha, Khamis Mushait, Jazan and Najran.
Saudi authorities say at least 73 people were injured, while fires were reported at several sites. pic.twitter.com/w2S7WwpdyW— Merry (@merry236419) September 8, 2026


