Viral Love Story: ఆయన వయసు 70, ఆమెకు 19.. పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకోలేదు, అయినా కూడా!

70 Year Old Man Marries 19 Year Old Lady In Pakistan Viral Love Story - Sakshi

‘మేరేజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌’.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని అంటారు. వివాహానికి ఈడు జోడు కుదరాలి అంటారు. అయితే, కొన్ని పెళ్లిళ్లు వింతగా విడ్డూరంగా జరుగుతుంటాయి. ముదిమి వయసులో ఉన్న వ్యక్తులకు యవ్వనులకు ముడిపడుతుంది. ఇటువంటి ప్రత్యేక వివాహాలకు సంబంధించి యూట్యూబర్‌ సయ్యద్ బాసిత్‌ వీడియోలు చేస్తుంటాడు. కొద్ది నెలల క్రితం పాకిస్తాన్‌లో 19 ఏళ్ల యువతిని 70 ఏళ్ల వ్యక్తి మనువాడాడు. అది తాజాగా వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం!

లిఖత్‌ అలీ (70) లాహోర్‌లోని ఓ పార్కుకు మార్నింగ్‌ వాక్‌ వెళ్తుండేవాడు. అక్కడకు షుమైలా (19) కూడా వస్తుండేది. అనుకోకుండా చోటుచేసుకున్న ఓ సన్నివేశం వారి మనసుల్ని కలిపింది. షుమైలా ముందు నడుస్తుండగా.. ఆ వెనకే వెళ్తున్న లిఖత్‌ అలీ ఓ పాటను హమ్‌ చేస్తున్నాడు. దాంతో మ్యూజిక్‌ అంటే చెవికోసుకునే ఆ యువతి.. లిఖత్‌ పాటకు ఫిదా అయింది. అలా వారిద్దరి మనసులు కలిశాయి. 
(చదవండి: ఏడుగురికి ఉరి శిక్ష..షాక్‌లో మానవ హక్కుల సంఘాలు)

‘ప్రేమ వయసు భేదాల్ని పట్టించుకోదు. అలా జరిగిపోతుంది అంతే!’ అని షుమైలా సిగ్గుపడుతూ చెప్పింది. మరి మీ పెళ్లికి పెద్దవాళ్లు ఒప్పుకున్నారా? లేక ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అని అడగ్గా.. ‘తొలుత ఒప్పుకోలేదు. వయసులో అంత తేడా ఉన్న వ్యక్తిని పెళ్లాడటం వద్దే వద్దు అని తేల్చిచెప్పారు. కానీ, నేను, లిఖత్‌ వారిని ఒప్పించగలిగాం’ అని కొత్త పెళ్లికూతురు బదులిచ్చింది. వయసులో భారీ తేడాలతో పెళ్లిచేసుకున్నవారిని దయచేసి నిందించవద్దని కోరింది. ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు ఎంచుకుంటారని చెప్పుకొచ్చింది. ఆత్మాభిమానం, వ్యక్తిత్వమే రెండు మనసుల కలయికకు, పెళ్లికి సోపానమని తెలిపింది. 

చెడు తిరుగుళ్లు తిరిగే బదులు మనసుకు నచ్చినవాడితో మనువు ఎంతో మంచిది కదా అని ఆమె సూచించింది. ఇక శరీరానికికే వయసు 70 అని.. తన మనసుకు కాదని లిఖత్‌ పేర్కొన్నాడు. ఎప్పుడూ హోటళ్లలో భోజనం చేసే తనకు.. భార్య రాకతో మరో కొత్త లోకం పరిచయమైందని అన్నాడు. ఇదిలాఉండగా.. గత ఆగస్టులో కూడా ఇటువంటి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. 55 ఏళ్ల వ్యక్తి 18 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. బాబీ డియోల్‌ పాటనే తమను ఒక్కటి చేసిందని వారు చెప్పడం గమనార్హం.
(చదవండి: ‘ఈ సలహా నా భార్య ఎప్పుడో చెప్పింది’.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top