అభిమాన నటుడికి బాలుడి అరుదైన నివాళి | 7 Years Old Boy Pays Special Tribute To Black Panther Chadwick Boseman | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ పాం‍థర్‌కు బాలుడి అరుదైన స్మారక చిహ్నం

Sep 5 2020 3:17 PM | Updated on Sep 5 2020 4:14 PM

7 Years Old Boy Pays Special Tribute To Black Panther Chadwick Boseman - Sakshi

లాస్‌ఎంజెల్స్‌: బ్లాక్ పాంథర్ స్టార్ చాద్విక్ బోస్‌మ్యాన్‌ మృతికి 7 ఏళ్ల బాలుడు ప్రత్యేక నివాళి అర్పించాడు. అమెరికాకు చెందిన కియాన్ వెస్ట్‌బ్రూక్ అనే బాలుడు తన అభిమాన నటుడి జ్ఞాపకార్థం రోజున స్మారక చిహ్నం కూడా నిర్వహించిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అవేంజర్స్‌ బొమ్మలను ప్రదర్శిస్తూ బోస్‌మ్యాన్‌కు వందనాలు అర్పిస్తున్న ఫొటోను బాలుడి తండ్రి కింగ్‌ వెస్ట్‌బ్రూక్‌ శనివారం తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

దీనికి ‘మా బాబు తన అభిమాన సూపర్‌ స్టార్‌ బ్లాక్‌ పాంథర్‌ కోసం ప్రత్యేకంగా నివాళి ఆర్పించాడు. అంతేకాదు బోస్‌మన్‌కు స్మారక చిహ్నన్ని కూడా ఏర్పాటు చేసి ‘వకాండా ఫరేవర్‌’ అంటూ వందనాలు ఆర్ఫించాడు’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. బోస్‌మ్యాన్‌కు ఇలా బాలుడు నివాళులు ఆర్పించి తన అభిమానాన్ని చాటుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టుకు ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా లైక్‌లు, వందల్లో కామెం‍ట్స్‌ వచ్చాయి. (చదవండి: బ్లాక్‌ పాంథర్‌ నటుడు కన్నుమూత)

‘ఇది నిజంగా హృదయాన్ని తాకే దృశ్యం’, ‘ఇది చూడగానే నా గుండె బరువెక్కింది’, ‘చాద్విక్‌ బోస్‌మ్యాన్‌‌ అద్భతమైన నటుడు. ఆయన అందరికి ఆదర్శం’ అంటూ నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యకం చేస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.ఈ పోస్టులో కియాన్‌ బ్లాక్‌ పాంథర్‌(బోస్‌మ్యాన్‌) బొమ్మను ఓ పెట్టలో ఉంచి నల్లటి పట్టు వస్రంతో కప్పాడు. దాని చూట్టు ఆవేంజర్స్‌‌ బొమ్మలను ప్రదర్శించాడు. అంతేగాక పూలు, ఆవార్డు పతకాన్ని కూడా బోస్‌మ్యాన్‌కు బొమ్మపై ఉంచాడు. అనంతరం పక్కనే నిలబడి నివాళులు ఆర్పించిన ఈ ట్వీట్‌ ఆయన అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.

అయితే బోస్‌మ్యాన్‌‌ మరణవార్త తెలియాగానే కియాన్‌ దిగ్భ్రాంతికి గురైనట్లు అతడి తండ్రి చెప్పాడు. ‘‘ఆయన(బోస్‌మ్యాన్‌) నాతో పాటు బ్లాక్‌ బాయ్స్‌ అందరికి రోల్‌ మోడలని, ఎందుకుంటే బ్లాక్‌ అబ్బాయిలు కూడా హీరో కాగలరని ఆయన నిరూపించారు’’ అంటూ కియాన్‌ చాద్విక్‌ మరణంపై ఇలా స్పందించాడంటూ బాలుడి తండ్రి పేర్కొన్నాడు. కాగా గత కొంతకాలంగా పెద్ద పెగు క్యాన్సర్‌తో బాధపడుతున్న చాద్విక్‌ బోస్‌మ్యాన్‌‌ ఆగష్టు 28న తుదిశ్వాస విడిచిన విషయం విధితమే.(చదవండి: నువ్వు నిజంగా దేవుడివి సామి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement