Manila: కూలిన భవనం.. శిథిలాల కింద 19 మంది విలవిల | 19 Workers Trapped Under Debris After Building Collapse in Philippines | Sakshi
Sakshi News home page

Manila: కూలిన భవనం.. శిథిలాల కింద 19 మంది విలవిల

May 24 2026 8:05 AM | Updated on May 24 2026 11:18 AM

19 Workers Trapped Under Debris After Building Collapse in Philippines

మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలోని ఏంజెల్స్ సిటీలో ఆదివారం తెల్లవారుజామున ఒక భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో పెను విషాదం చోటుచేసుకుంది. నిర్మాణ దశలో ఉన్న ఈ భవన శిథిలాల కింద దాదాపు 19 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు, శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.


సహాయక చర్యల్లో ఉత్కంఠ
భవనం కూలిపోయిన సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న 19 మంది కూలీల ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏంజెల్స్ సిటీ సమాచార అధికారి జే పెలాయో తెలిపిన వివరాల ప్రకారం ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement