సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అనిరుధ్.. కంప్యూటర్ సైన్స్ సెకండియర్ చదువుతున్నాడు. తాను ఉంటున్న బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి దూకిన అనిరుధ్.. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.


