Telangana Crime News: ఫ్లై ఓవర్‌ పై.. అదుపుతప్పిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. తీవ్ర విషాదం!
Sakshi News home page

ఫ్లై ఓవర్‌ పై.. అదుపుతప్పిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. తీవ్ర విషాదం!

Sep 9 2023 10:03 AM | Updated on Sep 9 2023 10:22 AM

A Young Man Died After Falling From The Flyover - Sakshi

హైదరాబాద్‌: మితి మీరిన వేగంతో ఫ్లై ఓవర్‌ రెయిలింగ్‌ను ఢీ కొట్టి  కింద పడటంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాను ప్రసాద్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా, కల్వాల గ్రామానికి చెందిన విగ్నేష్‌(24) శ్రీరాంనగర్‌లో ఉంటూ డ్రైవింగ్‌ యాప్‌లో రైడర్‌గా పని చేస్తున్నాడు.

శుక్రవారం రాత్రి అతను తన స్నేహితుడు మనీష్‌కు తెలియకుండా అతడి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ తీసుకుని బయటికి వచ్చాడు. కొండాపూర్‌ ఫ్లై ఓవర్‌ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా బైక్‌ అదుపుతప్పి కుడివైపు రెయిలింగ్‌ను ఢీ కొట్టి ఆగిపోగా విగ్నేష్‌ ఎగిరి బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌లో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. విగ్నేష్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement