నృత్య రూపిక | - | Sakshi
Sakshi News home page

నృత్య రూపిక

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

తెలంగాణ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. రవీంద్రభారతి వేదికగా శనివారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అభినేత్రి ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నృత్యరూపకాలు మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించాయి. కాగా కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ అంటే గొప్ప చరిత్ర అని, ఇక్కడి ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సలహాదారు ఆర్‌.గోవింద్‌ హరి, దేవాదాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, డైరెక్టర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రి

Advertisement
 
Advertisement
Advertisement