రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్
బంజారాహిల్స్: దేశంలో ఇంకా కులవివక్ష ఉందని, ఆధునిక యుగంలో కూడా అది కొనసాగడం దురదృష్టకరమని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి బెజవాడ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ‘పూర్వ విద్యార్ధుల స్ఫూర్తిదాయక ప్రసంగం’ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా సఫాయి కర్మచారి వ్యవస్థ ఉందని, దానిని నిర్మూలించడానికి చేపట్టిన ఇండియా ఎట్ 80 ఉద్యమానికి విద్యావంతులు, మేధావులు మద్దతు ఇవ్వాలని కోరారు. వైస్‌ఛాన్సలర్ ఘంటా చక్రపాణి ,రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, పల్లవి కాబ్డే, వీసీ ఓఎస్‌డీ రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు.


